నవంబర్ 1 విద్రోహదినం.. నల్ల జెండాలు ఎగురవేయండి: కోదండరాం

kodanda-ram


ఆంధ్రవూపదేశ్ అవతరణ దినమైన నవంబర్ 1ని విద్రోహదినంగా పరిగణించి, తెలంగాణలో నల్లజెండాలు ఎగురవేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రవూపదేశ్‌ను జైలుతో పోల్చారు. ‘‘తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ నివేదికకు పరిగణలోనికి తీసుకోకుండా ఈ ప్రాంతాన్ని ఆంధ్రలో కుట్ర పూరితంగా విలీనం చేశారు. ఆ విధంగా ఆంధ్రవూపదేశ్ అనే జైల్లో తెలంగాణ ప్రజలు ఇరుక్కొని ఆత్మగౌరవం కోల్పోయారు. అందుకే నవంబర్ 1న విద్రోహదినమని భావిస్తున్నాం.’’ అని తెలిపారు. తెలంగాణ విద్రోహ దినం రోజున నల్లబ్యాడ్జీలు, నలుపు రంగు అంగీలు ధరించి, నల్ల జెండాలు ఎగురవేయాలని తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు. నల్ల రంగు జెండాలతో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద తెలంగాణ జేఏసీ ముఖ్యనేతలు నల్లజెండా ఎగురవేస్తారని తెలిపారు. తెలంగాణలోని అన్ని గామాల్లో ఆ రోజున పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించి విద్రోహదినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రశంసాపవూతాలు తీసుకోవద్దు: శ్రీనివాస్‌గౌడ్
నవంబర్ 1 తెలంగాణ ప్రజలకు విద్రోహదినమైనందున రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని టీజేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆ రోజున అందించే ప్రశంసాపవూతాలను ఎవరూ తీసుకోవద్దని సూచించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.