నల్లికుట్ల కిరణాలు

-సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడంలేదు, స్వాగతించడంలేదు
-సమైక్యం కోసమే సంతకం చేశా.. తప్పేంటి?
-ఇన్నాళ్లూ ఇక్కడ ఉన్నవారిని పొమ్మంటే ఎలా?.. ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు జరుగుతున్నాయి
-విభజనతో సమస్యలు పెరుగుతాయి.. నదీ జలాల సమస్య ముందుకు వస్తుంది
-తెలంగాణకు విద్యుత్ తక్షణ సమస్య.. రాజధాని హైదరాబాద్‌పై స్పష్టతనివ్వాలి
-ఆంటోనీ నేతృత్వంలోనిది పార్టీ కమిటీయే
-ఉద్యోగులు సమ్మె విరమించాలి.. విగ్రహాల విధ్వంసం దురదృష్టకరం
-మీడియాతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
-తెలంగాణను ముందుకు తెచ్చింది వైఎస్సేనని వ్యాఖ్య
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు సీడబ్ల్యూసీ ప్రకటించిన తొమ్మిదిరోజులకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి మౌనం వీడారు. గురువారం అధిష్ఠానంపై దాదాపు పూర్తిస్థాయిలో ధిక్కార స్వరాన్ని వినిపించారు.
ఆంధ్రవూపదేశ్ కలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్న వాదనను మరొకసారి ముందుకు తీసుకువస్తూ తాను వాస్తవాలనే వివరిస్తున్నానని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడంలేదని, అలాగని స్వాగతించడంలేదని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు కేంద్రం విభజనపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఉన్న పరిస్థితులను కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారా? అన్న ప్రశ్నకు సీఎం స్పందిస్తూ మీ మాటలను నా నోట్లో పెట్టేందుకు ప్రయత్నించవద్దని అన్నారు.

తాను ఇరు ప్రాంతాల ప్రజల సమస్యలు, రాబోయే సమస్యల పరిష్కారం అంశాలను చెబుతున్నానన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్న ఆందోళనలను, విగ్రహాల విధ్వంసం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసాన్ని ఖండించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఇతర అంశాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. విభజన వల్ల కరెంటు, సాగునీరు, తాగునీరు సమస్యలు తలెత్తుతాయంటూ వాటిని వివరించేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. ‘ఇది మన రాష్ట్రం, ఇది మన స్థలం. నేను (కిరణ్‌కుమార్‌డ్డి) ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇన్నేళ్ళ తర్వాత వేరే రాష్ట్రం అంటే వారి (సీమాంవూధుల) మనోభావాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాక విభజన గురించి ఆలోచన చేయాలన్నదే నా అభిమతం’ అని కిరణ్ చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్న తదుపరి దానిపై సీమాంధ్ర ప్రాంత ప్రజావూపతినిధులు రాజీనామాలు చేశారు, వారి ప్రాంతంలో ఉన్న ప్రజాభీష్టం మేరకు అవి జరుగుతున్నాయి, వివిధ అంశాల్లోకి లోతుగా పోవాల్సిన అవసరం లేదన్నారు. ‘మా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి పంపించిన లేఖలో నేను సంతకం చేశాను. అందులో తప్పేంటీ?’ అని ఎదురు ప్రశ్నించారు.

ఆ లేఖను తమ పార్టీ అధ్యక్షురాలికే పంపించామని, ఆక్కడి ప్రజావూపతినిధుల భావాల మేరకు కలిసికట్టుగా తెలియజేయాలని, రాష్ట్రం కలిసి ఉండాలని కోరినట్లు చెప్పారు. ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుచేసి అందరితో చర్చించాకే ఇతర కార్యాచరణ చేయాలని కోరామని, తాము కోరిన మేరకు కేంద్ర మంత్రి ఆంటోనీ నేతృత్వంలో పార్టీ అధిష్ఠానం కమిటీని ఏర్పాటుచేసిందని సీఎం చెప్పారు. పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తుందని, దాంట్లో వివిధ అంశాలు స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నదనేది ప్రజలు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నిర్ణయానికి కారకులు వైఎస్ రాజశేఖరడ్డి అని పేర్కొన్నారు. ఆనాడు 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మొదలైంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎంఐఎం, సీపీఎం మినహా అన్ని రాజకీయపార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలమని స్పష్టం చేశాయని, తర్వాత రాజకీయ నాటకాలాడుతున్నాయని ఆరోపించారు.

ఇరిగేషన్‌లో ఎక్కువ ఇబ్బందులు..
రాష్ట్ర విభజన వల్ల ఇప్పుడున్న సమస్యలకంటే వచ్చే సమస్యలే ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అన్నారు. ప్రధానంగా ఇరిగేషన్‌లో ఎక్కువ ఇబ్బందులు వస్తాయంటూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాల పంపిణీ విషయాల గురించి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కింద 30 లక్షల నుంచి 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టు సరిహద్దులు రాయలసీమ, తెలంగాణ జిల్లాల పరిధిలో ఉన్నందున దీన్ని ఏవిధంగా పరిష్కరిస్తారనేదానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా నాగార్జునసాగర్ కూడా ఆంధ్రా తెలంగాణ జిల్లాల మధ్యలో ఉందని, ఈ ప్రాజెక్టు కింద దాదాపు 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దీంట్లో కుడికాల్వ కింద ఆంధ్రాలో 11 లక్షల ఎకరాలు, ఎడమకాల్వ కింద తెలంగాణలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తెలంగాణ జిల్లాల దిగువ నుంచి మరో రెండున్నర లక్షల ఎకరాలకు ఆంధ్రా ప్రాంతానికి నీరు పారుతుందని సీఎం కిరణ్ వివరించారు.

ఇలాంటివి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తారనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వల్ల 7.20లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయని, 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ వస్తుందన్నారు. గోదావరి నదీ జలాల పంపిణీలో వాటా ప్రకారం 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 21 టీఎంసీలు కర్ణాటకకు, 45 టీఎంసీలు ఆంధ్రవూపదేశ్‌కు రావాలని, కానీ ప్రతి ఏటా 2వేల టీఎంసీ గోదావరి నీరు సమువూదంలోకి వెళ్తుందని, ఈ ఏడాది మూడువేల టీఎంసీలు సమువూదంలోకి వెళ్ళాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీలోకి నీళ్ళు వస్తాయని, ఇలాంటి కోట్లాది మంది రైతుల జీవితాలతో ముడిపడిన విషయాలను రాష్ట్ర విభజనలో ఏ విధంగా పరిష్కరిస్తారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కావేరీ నదీజలాల సమస్య (లిటిగేషన్) 1992 నుంచి కొనసాగుతున్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య జల వివాదాల కేసులు సుప్రీంకోర్టులో నడుస్తున్నాయన్నారు.

తెలంగాణలోనే విద్యుత్ కొరత..
రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో తీవ్ర విద్యుత్ సమస్యలు నెలకొనే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో 65 శాతం మేరకు పంపుసెట్ల కింద వ్యవసాయం ఆధారపడి ఉందని, ఇందుకు ప్రభుత్వం రూ.4,000కోట్ల సబ్సిడీలను ఇస్తుందని, ఎక్కువ విద్యుత్ సబ్సిడీలు తెలంగాణకే ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని, వాస్తవానికి విద్యుత్ డిమాండ్ 113 నుంచి 115 మిలియన్ యూనిట్లు ఉందని, తెలంగాణ యాభై శాతానికి మించి విద్యుత్‌కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు. ఇటీవల టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు కరెంటు అంశంపై తప్పుడు లెక్కలు చెప్పారని, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామంటూ అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు.

వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నదే 10 వేల మెగావాట్ల ఉత్పత్తి, అందులో 6,300 మిలియన్ యూనిట్లు ప్రభుత్వరంగంలో ఉంటే 4,400 మిలియన్ యూనిట్లు ప్రైవేటు రంగంలో ఉందన్నారు. వచ్చే మూడేళ్ల వరకు గ్రిడ్ కనెక్టివిటీ వచ్చే అవకాశం లేదని, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటుచేస్తున్న గ్రిడ్ కనెక్టివిటీ ఏదీకూడా వచ్చే ఆరుమాసాల నుంచి ఏడాదిన్నర, రెండేళ్ల కాలానికి కానీ పూర్తి అయ్యే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాయలసీమలో 4 మిలియన్ యూనిట్ల కొరత (గ్యాప్) ఉందన్నారు. ఆంధ్రాలో 120 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే వినియోగం మాత్రం 76 మిలియన్ యూనిట్లు మాత్రమేనని తెలిపారు. గ్యాస్ కొరత వల్ల 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. వీటితో విద్యుత్ సంక్షోభం ఏర్పడే ఆస్కారం ఉంటుందని కమిటీకి చెబుతానని చెప్పారు.

ఉద్యోగుల అంశంపై అవాస్తవాలు..
ఉద్యోగుల గురించి అవాస్తవాలు మాట్లాడుతున్నారని సీఎం కిరణ్ విమర్శించారు. వాస్తవానికి 18,856 మంది ఉద్యోగులను 610 జీవోలో గుర్తించారని చెప్పారు. దాంట్లో 4,062 మంది ఉద్యోగులు మినహాయింపు పొందారని తెలిపారు. మిగిలిన 14,794 మంది ఉద్యోగుల్లో 9,174 మంది ఉద్యోగులను వారి వారి ప్రాంతాలకు పంపించామన్నారు. 5,620 మంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా, 90 శాతం మేర కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయని తెలిపారు. 610 జీవో పరిధిలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారని, జోన్-5 నుంచి జోన్-6కు వచ్చినవారు కూడా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా చదువు, ఆరోగ్యం, విద్య, ప్రైవేటు రంగంలో ఉపాధిపై ఆధారపడినవారు ఉన్నారని, ఇలాంటి వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారని సీమాంధ్ర ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్ర విభజనపై 2009లో ప్రభుత్వం రోశయ్య కమిటీని వేసిందని, అందులో ఇలాంటి అంశాలన్నీ పొందుపరచడం జరిగిందన్నారు.

ఉద్యోగులూ సమ్మె వద్దు
సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె నోటీసులు ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీవో, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అంశంపై గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు సీమాంధ్ర ప్రాంతంలో ప్రజా జీవితానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.

ఈ ఉద్యమంలో దురదృష్టవశాత్తు జాతీయనేతలు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసంచేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన నెహ్రూ, తెలుగుజాతి అంతా కలిసి ఉండాలని స్పష్టంగా పార్లమెంటులో గొంతెత్తి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీ, ఆంధ్రవూపదేశ్ అభివృద్ధికి ఎంతో ఆసక్తిచూపిన రాజీవ్‌గాంధీ విగ్రహాలను చాలాచోట్ల దుష్టశక్తులు, ఇతర పార్టీలవారు రాజకీయ లబ్ధికోసం ధ్వంసం చేస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేయవచ్చు కానీ, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన వైఖరి అనుసరిస్తామన్నారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈనాటివరకు ఒకే విధానాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. మీరు (సీమాంవూధులు) ఎలాంటి అపోహలకు, మనస్తాపానికి గురికావద్దు.. సమ్మె నోటీసులు వెనక్కి తీసుకోండి.. అని కోరారు. ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌కు ఆహ్వానిస్తామని, మీ అభివూపాయాలు ఉంటే ఇక్కడే (హైదరాబాద్) తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.