నల్లగొండ జిల్లా డీఆర్సీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు తెలంగాణ సెగ తగిలింది. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సునీతాలకా్ష్మరెడ్డిలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని వారు డిమాండ్ చేశారు. మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉధ్రిక్తత చోటుచేసుకుంది