నలుగురు దోషులకు ఉరిశిక్ష

వారి నేరం అత్యంత అరుదైనది
యావత్ సమాజాన్ని నివ్వెరపర్చింది
ఒళ్లు గగుర్పాటు కల్గించేలా వారి చర్యలు
న్యాయవ్యవస్థ కళ్లుమూసుకోజాలదు
ఇలాంటివారు సమాజంలో ఉండకూడదు
తీర్పులో జస్టిస్ యోగేష్ ఖన్నా వ్యాఖ్యలు
మా బిడ్డకు న్యాయం జరిగింది
‘నిర్భయ’ తల్లిదండ్రుల సంతృప్తి

న్యాయం బతికే ఉందని సమాజానికి ఓ భరోసా! చట్టం నుంచి తప్పించుకోలేరని నేరస్తులకు గట్టి హెచ్చరిక! hangభయానక ఉదంతంలో కంటి దీపాన్ని కోల్పోయి.. ఏడవడానికీ కన్నీళ్లు మిగలని దంపతులకు చిన్న ఊరట! తొమ్మిది నెలల క్రితం ఓ నిశిరాత్రి వేళ ఆరుగురు నరరూప రాక్షసుల వలలో చిక్కి.. కనీవినీ ఎరుగని రీతిలో.. ఒళ్లు గగుర్పాటు కల్గించే పద్ధతుల్లో.. అత్యంత పాశవిక లైంగికదాడికి గురై.. చనిపోయిన 23 ఏళ్ల మెడికల్ విద్యార్థిని ‘నిర్భయ’ కేసులో సాకేత్ జిల్లా కోర్టు యావద్దేశం హర్షించేలా.. కోట్ల మంది కోరుకున్న విధంగా తీర్పు వెలువరించింది! నలుగురు దోషులను చనిపోయేంత వరకూ ఉరి తీయాలని ఆదేశించింది! కదులుతున్న బస్సులో అమానుషంగా లైంగికదాడి చేసి..

దారుణంగా హింసించి.. నిలు గాయాలై.. రక్తమోడుతున్న నిర్భయ.. ఆమె స్నేహితుడిని గడ్డకట్టించే చలిలో నగ్నంగా రోడ్డుపై పడేసి.. వెళ్లిపోయిన వారి ఘాతుకాన్ని ప్రస్తావించిన సాకేత్ జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ యోగేష్‌ఖన్నా.. నలుగురు దోషులు ముఖేష్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ.. ఈ సమాజంలో జీవించడానికి అనర్హులని తేల్చి చెప్పారు. మహిళలపై దాడులు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటనపై న్యాయ వ్యవస్థ కళ్లు మూసుకుని ఉండలేదని అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి కఠినమైన సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ బిడ్డకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని చెప్పారు. ఈ కేసులో మరో దోషి రామ్‌సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడిని బాల నేరస్తుడంటూ జువెనైల్ హోమ్‌కు పంపిన సంగతి తెలిసిం

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.