నరనరాన తెలంగాణపై ద్వేషం.. చూసిన్రా నల్లికుట్ల కిరణ్ వేషం!!

అగజూడవయో.. నల్లికుట్ల కిరణ్ ఏషం.. నరనరాన తెలంగాణపై ద్వేషం పెంచుకుని పచ్చిసమైక్యవాదిగా, మూర్ఖుడిగా సీఎం కిరణ్ మాట్లాడిండు. అసలు సీఎంగా కాదు.. ఓ సైకోలాగా వ్యవహరించిండు.

హైదరాబాద్ లో విద్యాసంస్థలు, ఆస్పత్రిలను పంచాలట.. నీ అయ్య కట్టించిండా కిరణ్.. హైదరాబాద్ లో సీమాంధ్ర సీఎంగాడెవడైనా ఇక్కడ ఓ ఆస్పత్రి కట్టిండా.. స్కూల్ కట్టిండా.. కాలేజీ కట్టిండా.. అన్ని నిజాం కట్టించినవే..

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానానికి సీఎం కిరణే లేఖరాసి పంపిడట. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోరికమేరకే లేఖలో సంతకం చేసిన్నని కిరణ్ చెప్పిండు.

తెలంగాణవాళ్లు వాడుకుంటే ఆంధ్రాకు నీళ్లు రావట.. అంటే ఇన్నిరోజులు మా నీళ్లు అక్రమంగా వాడుకున్నవని ఒప్పుకున్నవు కదా.. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ కొరత ఏర్పడుతదట.  సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువట.. వాడకం తక్కువట.. అసలు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు ఎక్కడి నుంచి వస్తున్నది.. అరెరరె ఇంత తెలివితక్కువోన్ని సీఎంను చేసినోన్ని ఏమనాలె..

కేవలం సీమాంధ్ర సీఎంగా ప్రవర్తిస్తూ ఆంధ్రాలో ఆందోళన చేయిస్తున్న కిరణ్  కు మరొక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతలేదు.. ఇక చాలు కిరణ్.. దిగిపో..

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

One Response to నరనరాన తెలంగాణపై ద్వేషం.. చూసిన్రా నల్లికుట్ల కిరణ్ వేషం!!

  1. chandu says:

    manchi avkasham valla dolla thannanni maali okasari bayata pettadaniki