నడు బీజేపీ తెలంగాణ ఆత్మగౌరవ సభ

 

-బీజేపీలో విలీనంకానున్న నాగం ‘నగారా’
-రాజ్‌నాథ్‌సింగ్ రాక

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఆత్మగౌరవ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌డ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితి(టీఎన్‌ఎస్)ని ఈ సందర్భంగా బీజేపీలో విలీనం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాజ్‌నాథ్‌సింగ్ బేగంపేట విమానాక్షిశయానికి చేరుకుంటారు. అనంతరం ఆయన సభలో పాల్గొంటారు. ఈ సభకు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తావూతేయ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి, తెలంగాణ ఉద్యమ సంస్థలు, వివిధ జేఏసీల బాధ్యులు హాజరవుతారు. ఈ సభను విజయవంతం చేయడానికి బీజేపీ నేతలు, నాగం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి జనాన్ని సమీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.