నగరంపై ‘ఉగ్ర’ ఉన్మాద నీడ!

 

-మూడు దశాబ్దాలుగా ఉనికి చాటుతున్న ముష్కరులు
-దేశవ్యాప్త పేలుళ్లకు హైదరాబాద్‌లోనే మూలాలు

GOKUL-CHATభాగ్యనగరంపై ఉగ్రవాదం కోరలు చాచినట్టు మరోసారి సుస్పష్టమైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో తాజాగా జరిగిన పేలుళ్లు.. ముష్కరుల లక్ష్యాల్లో నగరం కూడా ప్రధానం గా ఉందన్న విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్‌లో సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులకు, ఇతర ఉగ్రవాద సంస్థలకు నగరం అడ్డాగా మారిందన్న విషయాలు వెలుగుచూశాయి. నగరంలోని ఉగ్రవాదులు, స్లీపింగ్‌సెల్స్ (నివూదాణ ఉగ్రవాదులు) సహకారం అందించినట్టు వెల్లడైం ది. 1990 దశకం నుంచే హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారినట్లు పలు ఆనవాళ్లు ఉన్నాయి. గత 20 ఏళ్లుగా దాదాపు 12 ఉగ్రవాద సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తేటతెల్లమవుతోంది.

తొలుత బంగారం అక్రమ రవాణా, ఆయుధాల సరఫరా, నకిలీ కరెన్సీకే పరిమితమైన ఈ ఉగ్రవాద సంస్థలు క్రమంగా భారీ స్థాయిలో పేలుళ్లు జరిపేదాకా తమ నెట్‌వర్క్‌ను విస్తృతపర్చుకున్నాయి. మొదట్లో బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా దేశాల నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొడ్డిదారిన హైదరాబాద్‌లోకి ప్రవేశించేవారు. అనంతరం నేరుగా పాకిస్థాన్ నుంచే రావడం మొదలుపెట్టారు. ఇలా వచ్చిన వారు నగరంలోని అమాయక నిరుపేద ముస్లిం యువకులకు జిహాద్ పేరిట రెచ్చగొట్టి.. మతఛాందసవాదాన్ని నూరిపోసి, వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. 1992లో నగరంలోని టోలీచౌకీలో హిజ్‌బుల్ ముజాహిదీన్ అనే సంస్థకు చెందిన ముష్కరులు జరిపిన దాడి లో ఓ అడిషనల్ ఎస్పీ చనిపోవడం అప్పటికే నగరంలో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాద భూతానికి ఓ నిదర్శనమని వివరిస్తున్నారు. 1993-94లో ఇక్ధాముల్ ముస్లిమీన్, తన్‌జీన్ ఇస్లాహుల్ ముస్లిమీన్ సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్ జలీల్ అన్సారీ నాయకత్వంలో అప్పట్లో నగరంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు సైతం నిర్వహించినట్లు తేలింది.

Dilshuknagar-bobblastఅదే సమయంలో కశ్మీర్‌కు చెందిన అల్‌జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ కూడా ఇల్ అబ్దుల్ కులూ నాయకత్వంలో నగరంలో పలు కార్యకలాపాలకు పాల్పడింది. 1995-97 మధ్య కాలంలో అస్గర్ అలీ నాయకత్వంలో మరో ఉగ్రవాద సంస్థ సైతం తమ ఉనికిని చాటింది. అనంతరం సులీమ్ జునాయిద్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది మరో ఇద్దరు అనుచరులతో కలిసి దొంగపాస్‌పోర్టుతో నగరానికి వచ్చాడు. హైదరాబాదీ అమ్మాయిని పెళ్లి చేసుకొని, దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడు. అయితే, కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు 1999లో రాత్రికి రాత్రే అతన్ని అరెస్టు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం 1999లో వరంగల్‌కు చెందిన ఆజంఘోరీ నాయకత్వంలో ఇండియన్ ముస్లిం మహ్మదీన్ ముజాహిదీన్ సంస్థ సైతం పలు కార్యకలాపాలకు పాల్పడింది. ఇకపోతే, 2000 సంవత్సరంలో దీన్‌దార్ అంజుమన్, జమాతే-ఇ-హిజ్‌బుల్లా-ముజాహిదీన్, 2001లో లష్కరే తోయిబాకు చెందిన హిజుబుల్ ముజాహిదీన్, అబ్దుల్ హజీద్ ముఠాలు సైతం తమ కార్యకలాపాలను కొనసాగించాయి. నగరంలో ఉగ్రవాద కేసుల్లో పోలీసులు గత మూడు దశాబ్దాల్లో 170 కిపైగా మందిని అరెస్టు చేశారు. నగరం ప్రస్తుతం ఉగ్రవాదులకు సురక్షిత ఆవాసంగా మారుతోందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. వీరే నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్, కశ్మీర్, ముంబై తదితర నగరాల్లో జరుగుతోన్న ఉగ్రవాద ఘటనలకు హైదరాబాద్‌లో ఆనవాళ్లు దొరుకుతుండటాన్ని ఉదహరిస్తున్నారు.

నెత్తుటి సంతకం
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (టీ మీడియా): ముష్కరుల మతిలేని చర్యకు భాగ్యనగరం మరోసారి నెత్తురోడింది. ఉగ్రవాదులు నగరాన్ని లక్ష్యంగా చేసుకొని గత కొన్నాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా మందిరం, మక్కా మసీదు, గోకుల్ చాట్, లుంబినీ పార్కుల జంట పేలుళ్లు, కానిస్టేబుల్‌పై ఉగ్రవాదుల కాల్పులు ఇలా వరుస ఘటనలతో హైదరాబాద్‌లో భయానక పరిస్థితిని సృష్టించారు. పైశాచిక దాడులతో పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు బలిగొన్నారు. నగరంలో జరిగిన ఉగ్రవాద ఘటనల వివరాలివి.

జంటపేలుళ్ల బీభత్సం!: 2007 ఆగస్టు 25న.. జంట పేలుళ్లు నగరాన్ని కుదిపేశాయి. నగరంలోని గోకుల్ చాట్, లుంబీనీ పార్కు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఈ పేలుళ్లలో 42 మంది చనిపోయారు. ఆ రోజు (శనివారం) సాయత్రం 7.30 గంటల ప్రాంతంలో లుంబినీ పార్క్‌లో లేజర్ షో జరుగుతుండగా పేలుడు సంభవించింది. దీని ధాటికి 12 మంది మరణించగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగిన పది నిమిషాలలోపే గోకుల్‌చాట్‌లో మరో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మంది గాయపడ్డారు. ఈ రెండు ఘటనలు జరిగిన కాసేపటికే దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్‌వూబిడ్జ్ సమీపంలో పోలీసులు మూడో బాంబుని గుర్తించి నిర్వీర్యం చేశారు.

దద్దరిల్లిన మక్కా మసీదు: 2007, మే 18న.. పాతబస్తీ చార్మినార్‌కు సమీపంలోని చారివూతక మక్కా మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడుతో ప్రార్థనామందిరంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దుర్ఘటనలో 14మంది చనిపోయారు. 53 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో ఒక పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వికారుద్దీన్ కాల్పుల కలకలం: 2009 జనవరిలో ‘ఉక్షిగ’కాల్పులతో నగరం ఉలిక్కిపడింది. నగరంలోని సంతోష్‌నగర్‌లో ఉగ్రవాది వికారుద్దీన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

పట్టపగలే ఉగ్రకాల్పులు: 2009 మే 18న పట్టపగలు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఫలక్‌నుమా సబ్‌స్టేషన్ ప్రాంతంలో పోలీసు పికెట్‌పై కాల్పులు జరిపి ఓ హోంగార్డు ప్రాణాలను బలిగొన్నారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అతి సమీపం నుంచి జరిపిన కాల్పులతో హోంగార్డు బాలస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ రాజేంవూదవూపసాద్ తీవ్రంగా గాయపడ్డారు. తెహరీక్-ఎ-గల్బా ఇస్లాం (టీజీఐ) పేరిట ఉగ్రవాది వికారుద్దీన్, అతని సోదరుడు సులెమాన్ ఈ కాల్పులకు తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి!: 2005 అక్టోబర్ 13న టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక హోంగార్డు మృతి చెందారు. నగరంలో జరిగిన ఏకైక మానవబాంబు ఇదేనని భావిస్తున్నారు. కాగా, 2002, నవంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద గురువారం సాయంవూతం స్కూటర్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ అరవై ఏళ్ల వృద్ధురాలు, ఏడేళ్ల బాలుడు మరణించారు. 2006. మే 7న ఓడియన్ థియేటర్‌లో బాంబు పేలడం తీవ్ర కలకలం రేపింది. 1992లో నగరంలో ఏఎస్పీ జీ కృష్ణవూపసాద్, అతని గన్‌మెన్‌ను ఉగ్రవాదులు హతమార్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.