ధర్మభిక్షం

ధర్మభిక్షం

scan121మచ్చలేని సీనియర్ ప్రజా నాయకుడు, అణగారిన జాతిలోంచి ఉద్భవించిన తెలంగాణ మొట్టమొదటి విద్యార్థి నాయకుడు, తెలంగాణ పోరాటయోధుడు, ఆర్యసమాజ్ సారథి ధర్మభిక్షం తన జీవిత చర్రితను రికార్డు చేస్తానని వచ్చిన కొంపెల్లి వెంకట్‌గౌడ్‌తో ఆరేళ్ల కిందట చెప్పిన తన స్వీయానుభవాలు ఇవి….‘ధర్మభిక్షం: మాట ముచ్చట’ అన్న పుస్తకం లోనివి…
అట్ట పలక పట్టుకుని సూర్యాపేటలో బడికి పోతుంటే ఒక షావుకారి, మిఠాయి వెంకన్న అంటరు…పెద్ద పాపులర్…
‘‘యిక్కడికి పైకి రా అబ్బాయ్’’ అన్నడు. పోయిన.
‘‘ఎవరబ్బాయివి నువ్వు, మీ తండ్రి పేరేంది? నీ ఇల్లు ఎక్కడ?’’ అని అడిగిండు.
‘‘మేం గౌడ్స్‌ము. బొమ్మగాని ముత్తిలింగయ్య కొడుకును’’ అన్న. అట్ల అనంగనే వాని టోన్ మార్చిండు.
‘‘ఎంతవరకు చదివినవ్ రా’’ అన్నడు.

నా మైండ్ పగిలిపోయింది. హృదయం కదిలిపోయింది. ఏంటి వీడు ‘అబ్బాయ్’, ‘బాబు’ అని పిలిచినోడు నా ఆకారం, పోలిక చూసి బ్రామ్మల పిల్లవాడు’ అనుకున్నాడేమో మాట మార్చిండు. ఈ ఘటన నా మనసును చేంజ్ చేసి, ‘సమాజంలో ఇది ఏంటి’ అని చిన్నతనంలోనే ఆలోచించేలా చేసింది. ‘ఈ డిఫన్స్ ఏమిటి?’ అన్న ఆలోచనలు క్రమేణా డెవలప్ అయినయ్ నాలో.
అప్పుడు నేను చిన్న స్టూటెండును. కిండర్‌గ్డాన్ స్టూడెంట్‌ను. 95, 96 సంవత్సరంలో కూడా ఇది చెపుతున్న నేను. ఆ షావుకారి పేరు కూడా చెప్పిన నీకు. ఇల్లు కూడా నాకైతే ఎరుకే… జ్ఞాపకం వుంది. కమాన్, బజార్ నేషనల్ హైవే పాత నేషనల్ హైవే రోడ్డుమీద. నన్ను కూచోపెట్టి అడుగుతా ఉంటే ఈ థాట్స్ వస్తున్నయ్….

నన్ను ప్రజలు ఆత్మీయంగా చూసుకున్నరు. నేను ఎక్కడ పర్యటించినా పీపుల్స్‌కు ఆత్మీయుడిగా అతుక్కుపోయి, వాళ్ల గ్రామాల్లో, వాళ్ల కుటుంబాల్లో చాలా ప్రేమను పొందేది. I have done such thing. ముఖ్యంగా విద్యార్థులు నన్ను ఆత్మీయంగా ‘భిక్ష్సాబ్’…‘భిక్ష్యాబ్’ అని పిలిచేది. కామన్‌గా విద్యార్థులంతా ‘భిక్ష్సాబ్’ అనే పిలుస్తారు. ‘ధర్మం భిక్షం’ అని ఎవరూ మాట్లాడరు. ‘భిక్షం సాబ్’ అని అనరాక ‘భిచ్ఛాబ్’…‘భిచ్ఛాబ్’ అనీ పిలిచేది. ఆత్మీయంగా వారి వొంకరి పిలుపులకు కూడా నేను రెస్పాన్స్ ఇచ్చేది. అది వొంకర పిలుపే. దూరంగా ఉండి అంటే అది తిట్టో గిట్టో కదా! ఎవరికో కానీ నాకైతే అట్ల కాదు…

What forced me to work in this deep manner to the public అంటే I am worried the society spoiled by exploiters, money lenders …
ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆత్మీయులుగానే మాట్లాడుత. కానీ వాడి విధి విధానాలను నేను ఎప్పుడూ విమర్శించలే….

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.