దోపిడీ కొనసాగింపునకే గవర్నర్‌కు పెత్తనం-కవిత

సీమాంధ్రులకు దోచిపెట్టే కుట్రలను కొనసాగించడానికే హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనాన్ని కట్టబెడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో గ్రామాభివృద్ధి కమిటీ, జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్షికమంలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌పై పెట్టిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రాంత ప్రజావూపతినిధులు రాజీనామాల ద్వారా చేస్తున్న కుట్రలు తెలంగాణ ఏర్పాటును ఆపలేవన్నారు. తెలంగాణ తల్లి సంకెళ్లు తెగే వరకు పోరాటాన్ని ఆపకూడదని, బిల్లు పాసయ్యేలా చూసే బాధ్యత ఇక అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉందన్నారు. తెలంగాణ సమాజం అంతా కలిసి పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సంపూర్ణ ఆవిష్కరణ ఏర్పాటుకు కీలకమైన రోజులని,ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలు, ఉద్యమకారులు, సీమాంధ్ర కుట్రలను తిప్పకొ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.