దొడ్డిదారి కబ్జాలకు దేవుడి తోడు!

సీమాంధ్ర నేతలు హెచ్‌ఏఎల్ ఉద్యోగస్థులకు చెందిన 62 ఎకరాల భూమిని టోకున కాజేయడానికి తమ భూదందాకు మతం ముసుగు కూడా తగిలించారు. మంత్రి గంటాశ్రీనివాసరావు, పత్తిపాటిపుల్లారావు, సుజనా చౌదరి తమ బినామిల ద్వారా జగత్‌కిలాడీలైన పాస్టర్లను ఇక్కడ రంగంలోకి దించారు. గుంటూరుజిల్లాకు చెందిన డాక్టర్ సతీష్‌కుమార్, సాయిసుధాకర్‌ల ద్వారా తమ పని కానిచ్చేశారు.. ‘రాజు, మంత్రి తనవాడైతే అడ్డుకునే వాడెవడు’ అన్న సామెత తీరుగా హెచ్‌ఏఎల్ ఉద్యోగస్థుల భూమిలో అక్రమంగా రాత్రికి రాత్రే కల్వరి టెంపుల్ పుట్టుకొచ్చింది.
ganta

దాన్ని అడ్డపెట్టుకుని అక్కడ మిగిలి ఉన్న రూ. 180 కోట్ల విలువ చేసే13 ఎకరాల భూమిని కూడా వదలకుండా కాజేశారు. చివరకు అక్కడ హెచ్‌ఎల్ ఉద్యోగులది ఈ భూమి అని తెలిపే ఓ బోర్డు, కార్యాలయం కోసం నిర్మించిన ఒక గది మాత్రమే మిగిలాయి. ఉదారంగా అది మాత్రం వదిలేశారు. ఈ కల్వరిటెంపుల్ పేరుతో ఆక్రమించిన భూమి కూడా బోలెడంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేశామంటూ మరో డాక్యుమెంటు సృష్టించేశారు. తమభూమిలో ఈ నిర్మాణాలేమిటని ప్రశ్నిస్తే భూమిని అక్రమించిన డాక్టర్ సతీష్‌కుమార్, మంచాల సాయిసుధీర్‌లు తాము శ్రావణ్‌కుమార్ అనే అతని వద్ద ఈ భూమి కొనుగోలు చేశామన్నారు. అంతేకాదు అతను సనత్‌నగర్‌కు కాబోయే ఎమ్మెల్యే అని బెదిరించారు.

ఏ అనుమతులు లేకుండానే….
కల్వరీ టెంపుల్‌కు ఏ అనుమతీ లేదు. వాస్తవానికి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఎక్కడైనా ఎలాంటి నిర్మాణాలు చేసినా చట్టవిరుద్ధమే.. తక్షణం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయాలి… కానీ నేరుగా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల అండదండలతోనే ఇక్కడ నిర్మాణం జరుగుతున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌డ్డి రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని అప్ప టి జీహెచ్‌ఎంసీ కమిషన్ కృష్ణబాబుకు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యే చెబితే ఎంత? అదీ సీమాంవూధలు పాలనలో..! కబ్జా చేసిన ఈ భూమి లో నిర్మాణాలకు అనుమతి ఇవ్వమంటూ ఆ తర్వాత ఈ కబ్జాదారులు 2012 డిసెంబర్ 6వ తేదీన జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక సింగిల్ కాగితంపై రాసిచ్చారు. భవన నిర్మాణాలకు అనుమతికి బిల్డింగ్ ప్లానర్లతో ప్లాన్ తయారు చేయించి ప్లాన్‌ను జత చేయాలి. డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాలి, భూమి రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. దరఖాస్తు అందుకున్న తరువాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అనుమతి ఇస్తారు. అయితే అధికారి వచ్చిందీ లేదు.. చూసిందీ లేదు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి 15 రోజుల్లో అక్కడ జరిగిన నిర్మాణాలను కూల్చి ఫోటోలు తనకు సమర్పించాలని ఆదేశించారు. కానీ ఇంత వరకు స్టే కల్వరి టెంపుల్‌ను కూల్చలేదు. దీనిపై స్టే తెచ్చుకున్నా రని అధికారులు అంటున్నారు. స్టే వెకెట్ చేయమని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. వివిధ కారణాల రీత్యా ఇప్పటికీ ఆ కేసు వాయిదా పడుతున్నది. అయితే భారత రాజ్యాంగంలోని సెక్షన్226(3) ప్రకారం స్టే వెకెట్ పిటిషన్ వేసిన 15 రోజులలో ఆర్డర్ ఇవ్వకపోతే ఆ స్టే రద్దు అవుతుంది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ అధికారులు రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ, వారు ససేమిరా అంటున్నారు. కల్వరి టెంపుల్‌కు విద్యుత్ అధికారులు కనెక్షన్ కూడా ఇచ్చారు. ఈ భూమి హెచ్‌ఏఎల్ ఉద్యోగస్థులదేనని పలుసార్లు కోర్టులు తీర్పులు ఇచ్చాయి. రంగాడ్డి జిల్లా సివిల్ కోర్టులో వేసిన ఓఎస్/359/2001 సివిల్ సూట్‌లో ఈ భూమి హెచ్‌ఏఎల్ సొసైటీకే చెందుతుందని, పర్మినెంట్ ఇంజక్షన్ ఇచ్చారు. భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టులు ఆదేశించాయి. డబుల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు మూడునెలల్లో దీనిని అమలు చేయాలని 2012 నవంబరు11వ తేదీన జస్టీస్ సీవీ నాగార్జునడ్డి ఆదేశించారు. ఇలా వివిధ రకాలుగా ఈ భూమిని దక్కించుకోవడం దాదాపు డజన్‌కేసులు వేయగా దాదాపు అన్నింటా అనుకూల తీర్పులు వచ్చినా అధికారులు కబ్జారాయుళ్లకే కొమ్ముకాశారు.
board
గుంటూరు బాబు హైదరాబాద్‌లో రుబాబు..
సీమాంధ్ర ప్రజా ప్రొటెక్షన్ ఫ్రెంట్ పేరిట ఓ సంస్థను స్థాపించి నగరంలో అలజడిని సృష్టించేందుకు యత్నిస్తున్న మంచాల సాయిసుధాకర్‌ది గుంటూరు జిల్లా మంగళగిరి. సత్తనపల్లిలో కేవలం నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉన్న సాయిసుధాకర్ కోట్లకు పడగపూత్తడం ఒక మిస్టరీ. కూకట్‌పల్లిలో ఎంఎస్‌ఆర్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్టు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.

ఫాస్టర్ సతీష్‌కుమార్‌పై విచారణ చేయాలి
– తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య డిమాండ్
హెచ్‌ఏఎల్ ఉద్యోగుల స్థలాన్ని ఆక్రమించి కల్వరి టెంపుల్ నిర్మాణం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షులు జెరుసలెం ముత్తయ్య చెప్పారు. ప్రభుత్వం వెంటనే సతీష్‌కుమార్ వ్యవహారంపై బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చర్చినిర్మాణం పేరిట ప్రజల వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.కొన్నేళ్లుగా సతీష్‌కుమార్‌తోపాటు శ్యామ్‌కిషోర్, స్టీఫెన్ ఫాల్, బ్రదర్ అనిల్, సామ్యూల్ పట్టా, రాజమండ్రి థామస్‌తో మరికొంతమంది సీమాంధ్ర నుంచి ఇక్కడకు వచ్చి ఫంక్షన్ హాల్స్‌లో ప్రార్థనలు చేస్తూ తెలంగాణ ఫాస్టర్లు, చర్చిలకు చెందిన భక్తులను ఆకర్షించుకొని ఆధ్యాత్మిక కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మణికొండ వద్ద పేదల భూములు కబ్జా చేసి బ్రదర్ అనిల్ కుమార్, ఇప్పుడు సతీష్‌కుమార్ క్రైస్తవులు తలదించుకునే పరిస్థితి కల్పించారని ఆరోపించారు.

హైకోర్టులో స్టే ఉంది..
హైకోర్టులో స్టే ఉంది కాబట్టి ఏమీ చేయలేక పోతున్నాం. అనుమతి లేని నిర్మాణాన్ని కూల్చి వేయమని కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూల్చివేతకు మేము సన్నాహాలు చేసేలోగా వారు స్టే తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు స్టే గడువు ముగుస్తావుంటే.. న్యాయమూర్తి గడువు పొడిగిస్తున్నారు. రఘు,చీఫ్ సిటీ ప్లానర్, జీహెచ్‌ఎంసీ

టైటిల్ డీడ్ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఏమీ చేయలేదు
టైటిల్ డీడ్‌ల విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఏమీ చేయలేదు. రిజిస్ట్రేషన్లను డిక్రీల ద్వారా చేశాము. దాంట్లో మా ప్రమేయం లేదు. హెచ్‌ఏఎల్‌కు సంబంధించిన అన్ని కేసులను హైకోర్టు కొట్టి వేసి సివిల్ కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చింది. అశోక్,రంగాడ్డి జిల్లా రిజిస్ట్రార్

మంత్రి గంటా ఈ భూమి తనదన్నారు
మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ భూమి తాను కొన్నానని దబాయిస్తున్నాడు. భూమి ఆక్రమణ మీద, అక్రమ నిర్మాణాల మీద ఎప్పటికప్పుడు పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదు. పోలీసు అధికారులైతే ఈ భూమిపై స్టేటస్కో ఉందని చెప్పి మమ్మల్ని ఆ వైపుకు వెళ్లనివ్వ లేదు. ఆక్రమణ దారులు నిర్మాణాలు చేపడుతుంటే మాత్రం పట్టించుకోలేదు. దీంతో అక్కడ కల్వరి టెంపుల్ కట్టేశారు. మా కాంప్లైంట్ మీద ఇంత వరకు కేసు కూడా నమోదు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌ను కూడా కలిశాం.. ఫలితం లేదు. కోర్టు మాకు ఎన్ని తీర్పులు ఇచ్చినా అధికారులు అమలు చేయడం లేదు. తెలంగాణలో తెలంగాణ ప్రజల భూములకు రక్షణ లేనేలేదని అర్థమైంది. జీ రామావతారంహెచ్‌ఏఎల్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి

ఇంటి స్థలం కొని 30 ఏళ్లైంది….
మేము ఇంటి స్థలాన్ని కొనుక్కొని 30 ఏళ్లైంది. ఇప్పటి వరకు అది చేతికి రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. సర్కారు పెద్దలే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆక్రమణలు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఈ స్థలంలో బతికుండగా మా పిల్లలైనా ఇంత ఇల్లు కట్టుకుంటే కంటి నిండా చూసి చావాలని ఉంది. అది నెరవేరేలాగా కనిపించడం లేదు.వీఎస్ హరగోపాల్, హెచ్‌ఏఎల్ హౌసింగ్ సోసైటీ సభ్యుడు
వారసులకైనా దక్కుతుందా?
ఉద్యోగంలో చేరినపుడు ఈ స్థలం కొన్నా.. ఇప్పుడు నాకు 76 ఏళ్లు. ఇల్లు కట్టుకుందామంటే అధికారులు లిటిగేషన్లు అడ్డం పెట్టారు. ఆక్రమించుకున్న వాళ్లు మాత్రం రాత్రికి రాత్రే భారీ నిర్మాణాలు చేసుకుంటున్నారు. అడిగేవాడు లేడు. కనీసం నా వారసులకైనా ఈ స్థలం దక్కితే అంతే చాలు. కనీసం తెలంగాణ నాయకులైనా ఈ ఇంటి జాగా ఇప్పిస్తే వారికి రుణపడి ఉంటా. వీ కుటుంబరావు, హెచ్‌ఏఎల్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు

అప్పు చేసి ప్లాటు కొన్నా..
సొసైటీలో సభ్యత్వం తీసుకొని ఇంటి జాగా తీసుకున్న రోజు నా జీతం రూ.400లు. కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో అప్పుతీసుకొని ప్లాటు కొనుక్కున్నా. పదవీ విరమణ చేసి చాలా సంవత్సరాలైంది. ఈ వయసులో ఇంటి జాగా కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలాంటి దురవస్థ పగవాడికి కూడా వద్దు.. మేం కొన్న భూమిని .. ఈ భూమి నాది అంటున్న మంత్రిని ఏమనాలో మాటలు రావడం లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది.. ఈ మంత్రి మా భూములు అక్రమించుకోడానికా? తెలంగాణ నాయకులైనా మా ప్లాటు మాకు ఇప్పించాలి.టీ భాస్కరగుప్తా, హెచ్‌ఏఎల్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు

This entry was posted in ARTICLES.

Comments are closed.