దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. సప్తవర్ణాలతో హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వినూత్న రీతిలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. పలు చోట్ల టమాటాలతో హోలీ ఆడుతుంటే, మరి కొన్ని చోట్ల తీన్‌మార్ చప్పుళ్ల మధ్య హోలీ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల వారు అక్కడి సాంప్రదాయాలకు అనుగుణంగా హోలీ సంబురాలు జరుపుకుంటున్నారు. యువతీ, యువకులు హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ వేడుకల్లో ఉరిమే ఉత్సాహంతో పాల్గొంటున్నారు. పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ హిందువులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో హోలీ సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు ప్రముఖుల నివాసాలు రంగుల మయంగా మారాయి.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.