దేశంలో 11లక్షల టీచర్ పోస్టులు ఖాళీ

– రాష్ట్రంలో 27,679..
– విద్యాహక్కు చట్టం ప్రకారం పోస్టులు భర్తీ చేయండి: సీఏబీఈ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలంటే.. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని సీఏబీఈ (సెంవూటల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) రాష్ట్రాలను కోరింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 11,87,761 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, రాష్ట్రంలో 27,679 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 35 మందికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాల్సి ఉంటుందని సీఏబీఈ తెలిపింది. కాగా, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా అవసరమైన పోస్టులు సృష్టించాలన్న ప్రతిపాదనలపై.. ఏప్రిల్ 2న ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డ్ సమావేశం సానుకూలంగా వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ప్రకారం అవసరమైన పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.