దేశంలో ‘విశ్వాసం’ కొరవడింది : మోడీ

గోవా : కాంగ్రెస్ పాలనలో దేశంలో విశ్వాసం కొరవడిందని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ లేని భారత్ కోసం కృషి చేస్తానని మోడీ చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీగా తనను నియమించిన రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను ఈ స్థాయికి తీర్చిదిద్దిన బీజేపీ కార్యకర్తలకు ఈ గౌరవం దక్కుతుందన్నారు. గోవాలో లభించిన దీవెనలతో పార్టీ అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే రాజ్‌నాథ్‌సింగ్ కలలను నిజం చేద్దామని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎవరికీ నమ్మకం లేదని తేల్చిచెప్పారు. ప్రచారం కోసం కాంగ్రెస్ కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ఘటనలో మృతి చెందిన జవాన్లకు సంతాపం తెలపాలన్న ఆలోచన ప్రధానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రణాళిక సంఘంతో పాటు ఉన్నత స్థాయి సంస్థలను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.