దీదీకి మోడీ స్నేహహస్తం!

మమత ప్రజల ఆకాంక్ష నెరవేర్చగలరు కోల్‌కతా వ్యాపారవేత్తల సదస్సులో నరేంవూదమోడీ ప్రశంసలు వామపక్ష పాలనలో బెంగాల్ నాశనమైంది కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రానిది వివక్షే యూపీఏకు సమయం దగ్గరపడింది: మోడీ – మమత ప్రజల ఆకాంక్ష నెరవేర్చగలరు – కోల్‌కతా వ్యాపారవేత్తల సదస్సులో నరేంవూదమోడీ ప్రశంసలు – వామపక్ష పాలనలో బెంగాల్ నాశనమైంది – కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రానిదే వివక్షే – యూపీఏకు సమయం దగ్గరపడింది: మోడీ కోల్‌కతా, ఏప్రిల్ 9: బెంగాల్ దీదీ మమతాబెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ ప్రయత్నించారు. ఒకప్పటి ఎన్డీయే మిత్రపక్షమైన మమతకు స్నేహహస్తాన్ని అందిస్తూ సంకేతాలు పంపారు. బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మమతాబెనర్జీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారనే విశ్వాసం తనకుందని మోడీ పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్రంలోని యూపీఏ సర్కారుపై, వామపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 32 ఏళ్ల వామపక్షాల పాలనలో బెంగాల్ నాశనమైపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని, సమాఖ్య విధానాన్ని దెబ్బతీస్తోందని తూర్పారబట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న మోడీ.. మంగళవారం కోల్‌కతాలో వ్యాపారవేత్తల సమాఖ్య సదస్సులో ప్రసంగించారు. ‘‘గుజరాత్‌లో మీరు చూస్తున్న అభివృద్ధి 12-13 ఏళ్ల కఠినక్షిశమ ఫలం. కాంగ్రెస్ పాలనలో పాతుకుపోయిన కన్నాలను మెత్తడానికి నాకు చాలా సమయం పట్టింది. బెంగాల్‌లో 32 ఏళ్లపాటు వామపక్షాలు లొసుగులను సృష్టిస్తూ పోయాయి. వాటిని అధిగమించడానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో నేను చెప్పలేను. ఈ లోపాలను అధిగమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసిస్తున్నాను. ప్రజల కలలను నెరవేరుతాయని నాకు నమ్మకముంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల యూపీఏకు రాంరాం చెప్పిన తృణమూల్ కాంగ్రెస్‌ను మచ్చిక చేసుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోడీ మాట్లాడుతూ.. కేంద్రంలో వాజపేయ్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఉన్నప్పుడు తమపై వివక్ష చూపినట్టు బెంగాల్ నుంచి ఎలాంటి విమర్శ రాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బెంగాల్‌పై కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించిందని విమర్శించారు. బెంగాల్‌కు, గుజరాత్‌కు మధ్య పోలిక పెట్టాలని మీడియా కోరుతోందని, తాను అందుకు ఇక్కడికి రాలేదని పేర్కొన్నారు. గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఢిల్లీ నియమితులు తమకు ఇష్టం ఉన్నా, లేకున్నా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. తప్పక చేయాల్సిన పని విషయంలో విధాన పక్షవాతంతో వ్యవహరిస్తున్న కేంద్రం.. చేయకూడని పనుల్లో మాత్రం అత్యంత ఉత్సాహం కనబరుస్తోందని ఎద్దేవా చేశారు. యూపీఏకు సమయం దగ్గరపడిందని, అది క్యాలెండర్‌ను కాకుండా గడియారాన్ని చూసుకుంటోందని పేర్కొన్నారు. ప్రధాని పదవి చేపట్టే విషయమై సదస్సులో పలువురు అడిగిన ప్రశ్నలను మోడీ తోసిపుచ్చారు. ‘‘ఒక రాజకీయ నాయకుడికి పధాని కావాలన్న) ఆకాంక్ష ఉండొచ్చు. కానీ నేను రాజకీయ నాయకుడిని కాదు. రాజకీయేతరుడిని’’ అని ఆయన పేర్కొన్నారు. భారతీయ జాలర్లను కాల్చిచంపిన కేసులో నిందితులైన తమ దేశ నావికులను పంపే విషయంలో చివరికీ ఇటలీ కూడా భారత్‌ను భయపెట్టాలని చూసిందని మోడీ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల భేటీలో మోడీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలు అత్యంత ద్వేషించిన కేంద్ర ప్రభుత్వం ఇదేనన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.