దీక్ష విరమించిన వామపక్ష నేతలు

 హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై చేపట్టిన దీక్షను వామపక్ష నేతలు గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఉదయం విరమించారు. నారాయణ, రాఘవులు సహా ఏడుగురు వామపక్ష నేతలు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు ఆస్పత్రిలో దీక్ష విరమించామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో జెన్‌కోకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలపై టీడీపీ చేపట్టిన దీక్షను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్ సమస్యలపై ఇంతటితో తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.