దస్ టీవీ బాసులు బస్ కరో..!

 ఏం ఆంధ్రా పైత్యం తలకెక్కిందా? మీలో నిద్రిస్తున్న సమైక్యవాదం బుసలు
కొడుతుందా? ఎందుకు తెలివితక్కువ వార్తలు రాస్తున్నరు. దస్ టీవీ బాసులు బస్ కరో..  తలాతోక లేకుండా కేసీఆర్ మేనల్లుడన్న ఒకే కారణంతో 10టీవీ బాసులు..  హరీష్ రావును టార్గెట్ చేసిన్రు.. తెలంగాణ నేతపై అక్కసు వెళ్లగక్కిన్రు. 10టీవీ పెద్దలు అల్లుళ్ల అరాచకాలపై హాఫెన్ అవర్ స్టోరీ చేసిన్రు. అందులో మామను వెన్నుపోటు పొడిచి.. నందమూరి పార్టీని లాక్కున్న బాబు గురించి..  రక్షణ స్టీల్స్, టీవీతో ప్రజల సొమ్ము దోచుకున్న వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ గురించి.. కుంభకోణాలతో కోట్లకు పడగలెత్తిన సోనియా అల్లుడు రాబర్ట్ వదేరా గురించి.. రైల్వే ఉద్యోగి దగ్గర 90 లక్షలు లంచం తీసుకున్న
బన్సల్ అల్లుడు విజయ్ సింగ్లా గురించి.. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ గురించి రాసిన్రు..  వీళ్లతో పాటు మేనమామ కేసీఆర్ కు అండగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న హరీష్ రావు ను జత చేసిన్రు.

బాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దానికి రాష్ట్రం మొత్తం సాక్షి, రక్షణ స్టీల్స్ వ్యవహారంలో బ్రదర్ అనిల్ దోషి.. ప్రభుత్వం దాన్ని రద్దు కూడా చేసింది.. రాబర్ట్ వదేరా స్కాంలు చేసి కోటీశ్వరుడయ్యాడని ఆధారాలతో సహా నిరూపితమైంది..  విజయ్ సింగ్లా లంచం తీసుకున్న విషయంలో అరెస్ట్ అయిండు.. ఫిక్సింగ్ గురునాథ్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నడు. వీళ్లందరి వ్యవహారాలపై ఆరోపణల కన్నా ఎక్కువ ఆధాలున్నయి..  మరి హరీష్ రావు విషయంలో నీ దగ్గర ఏం ఆధారాలున్నయి..

అసలు ఆ దోపిడీదారులకు హరీష్ రావుకు ఏమైనా సంబంధం ఉన్నదా? అందరినీ ఒకే గాడిన ఎందుకు కట్టిన్రు. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కేందుకు హరీష్ రావును అవినీతిపరులు, దుర్మార్గుల జాబితాలో కలుపుతరా?
హరీష్ రావు వల్ల టీఆర్ఎస్ నుంచి బయటకు పోయిన్రని మీరు పేర్లు వేసిన వ్యక్తులకు ఒకసారి ఫోన్ చేసి అడగండి.. వాళ్లు ఎందుకు పార్టీని వీడారో.. మీరు వేసిన పేర్లలో ఏ ఒక్కరైనా హరీష్ రావు వల్ల పార్టీని వీడామని  చెప్తరో చూడండి.. ఒక వెబ్ సైట్ నడిపే నేనే పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆర్టికల్ రాయను.. అలాంటిది చానల్ నడిపే మీరు నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు నేతలు హరీష్ రావు వల్ల పార్టీని వీడారని రాసిన్రు.. అసలు చానల్లో వార్తలు రాస్తున్నరా.. లేకపోతే ఫేస్ బుక్ లో కామెంట్లు పెడ్తున్నరా? బ్లాగ్ నడుపుతున్నరా?  మీకు బ్లాగుల్లో వార్తలు రాసే నాలెడ్జ్ కూడా లేదని  హరీష్ రావుపై వేసిన వార్త చూసినవాళ్లకు అర్థమవుతది.  మీకు తెలంగాణపై, తెలంగాణ నేతలపై ఎంత పగుందో తెలుస్తున్నది.. వాళ్లతో హరీష్ రావును ఎట్ల పోలుస్తరు..?  ఇంత కక్షపూరితంగా వార్తలు రాస్తరా? మీది ప్రత్యామ్నాయ చానల్ అంటే ఏంటో అనుకున్నాం.. సమైక్య, పెట్టుబడిదారి చానళ్లకు మరో ప్రత్యామ్నాయం అవుతారనుకోలేదు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.