దళితులు, కాపులే టార్గెట్-సమైక్యం ముసుగులో విరుచుకుపడుతున్న కమ్మ, రెడ్డి కులాలు

సీమాంధ్రలో సమైక్యవాదం ముసుగులో అరాచక కాండ కొనసాగుతున్నది. దళితులు, కాపులే టార్గెట్ గా దాడులు జరుగుతున్నయి. మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన్రు. ఎంపీ హర్షకుమార్ కు చెందిన వాహనాలను ధ్వసం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న మహిళలపై రాళ్లు రువ్విన్రు. కోస్తాంధ్రలో దళితులను టార్గెట్ చేసిన కమ్మ, రెడ్లు.. ఉత్తరాంధ్రలో కాపులను టార్గెట్ చేసిన్రు. బొత్స సామాజికవర్గానికి చెందిన వారిపై దాడులు కొనసాగుతున్నయి. బొత్స కాలేజీని, ఇంటిని, సత్యవిజన్ కేబుల్ ఆఫీస్ ను తగులబెట్టిన్రు. ఇప్పుడు కమ్మ, కాపు, రెడ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. మధ్యలో దళితులపై దాడులు జరుగుతున్నయి. అయితే ఈ దాడులకు స్కెచ్ మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్, జగన్ క్యాంప్ ఆఫీస్, టీడీపీ ఆఫీస్ నుంచి జరుగుతున్నయని సీమాంధ్ర దళిత బహుజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నయి.

సీమాంధ్రలో 8 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అధికారం శాశ్వతంకాదని.. సమైక్యం ముసుగులో అసాంఘిక శక్తులు అరాచకాలు చేస్తున్నయని బొత్స మండిపడ్డరు.

ఇప్పటికైనా బాధిత నేతలు విభజనను సమర్థించాలని.. 8శాతం ఉండి అధికారం చెలాయించాలని చూస్తున్న కమ్మ, రెడ్ల కుట్రలను తిప్పికొట్టి.. సీమాంధ్రను బాగు చేసుకోవడానికి తమతో చేతులు కలపాలని సామాజికాంధ్ర జేఏసీ నేతలు కోరుతున్నరు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.