దమ్ముంటే చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించండి-జోగు రామన్న

చంద్రబాబుతో దమ్ముంటే జై తెలంగాణ అనిపించాలని టీడీపీ ఫోరం నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్ విసిరిన్రు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అందుకే టీడీపీ వీడాను.. తెలంగాణలో పిల్లల చావులకు చంద్రబాబే కారణమని జోగు రామన్న ఆవేశంతో ఊగిపోయిన్రు.

సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్ గిరిజనులకు ఎలాంటి మేలు జరగలేదని జోగు రామన్న అన్నరు. వైద్య సదుపాయం లేక గిరిజనులు మత్యువాత పడుతున్నారు. విద్యాపరంగా చాలా నష్టం జరిగింది. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును సీమాంధ్ర పాలకులు పట్టించుకోవడం లేదు. సాగునీటిలో ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. బోరు బావులు తవ్వడం అభివృద్ధి అనడం హాస్యాస్పదమని అన్నరు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.