దద్దరిల్లిన బోస్టన్

 

bothsa– మారథాన్ లక్ష్యంగా రెండు వరుస పేలుళ్లు
– ముగ్గురు మృతి, 140 మందికి గాయాలు
– రన్నర్లు గమ్యస్థానానికి చేరుకుంటుండగా ఘటన
– దేశీయ ఉగ్రవాద సంస్థలపై అనుమానం
– బాధ్యులెవరైనా వదిలిపెట్టం: అమెరికా అధ్యక్షుడు

అగ్రరాజ్యం అమెరికా.. బోస్టన్‌లో కోలాహలంగా మారథాన్ కార్యక్రమం. 27వేల మంది మారథాన్ రన్నర్లు.. వారిని ఉత్సాహపరచడానికి వేలాదిగా గుమిగూడిన ప్రజలు.. మరికొన్ని క్షణాల్లో సుదీర్ఘ పరుగుపందెం ముగిసి ఆనందోత్సవాల్లో తేలిపోవాల్సి ఉండగా.. సరిగ్గా గమ్యస్థానంలోనే ఒక్కసారిగా భారీ శబ్దం. క్షణాల వ్యవధిలో 100 అడుగుల దూరంలో రెండు వరుస పేలుళ్లు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు హాహాకారాలు. ఆర్తనాదాలు.. నెత్తుటి మడుగులో ముగ్గురి మృతదేహాలు. 140 మందికిపైగా గాయాలు. విజయానందంతో పొంగిపోవాల్సిన చోట విషాదం.. ప్రఖ్యాతిగాంచిన బోస్టన్ మారథాన్ కార్యక్రమం వద్ద సోమవారం జరిగిన వరుస పేలుళ్ల దృశ్యమిది. ఈ పేలుళ్లతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుళ్లలో ఎనిమిదేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతిచెందారు. దాదాపు 140 మంది గాయపడ్డారు. చెత్తలో దాచిపెట్టిన రెండు బాంబులు సాన్థిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో పేలాయి. దేశీయ ఉగ్రవాద సంస్థ ఈ బాంబు పేలుళ్లకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.

పేలుళ్లపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. బాధ్యులెవరైనా చట్టం ముందుకుతెచ్చి శిక్షిస్తామని తెలిపారు. పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తముందా? అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే, పేలుళ్ల ఘటన వెనుక ఉగ్రవాద కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్టు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తంపై ఇప్పుడు ఓ నిర్ధారణకు రావడం సరికాదని ఉగ్రవాద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా తయారుచేసిన బాంబులు కావడంతో పెద్దగా నష్టం జరగలేదని, కాబట్టి అల్‌కాయిదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం పేలుళ్ల వెనుక ఉండకపోవచ్చునని చెబుతున్నారు. పేలుళ్ల వెనుక మధ్యప్రాచ్యం హస్తముందని, పేలుళ్లలో గాయపడి.. ఆస్పవూతిలో చికిత్స పొందుతున్న ఓ సౌదీ జాతీయుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. అమెరికాలో గతంలో కూడా దేశీయ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు.

1995లో ఓక్లాహమా నగరంలో వారు జరిపిన పేలుళ్లలో 168 మంది చనిపోయారు. 1996లో అట్లాంటాలో ఒలింపిక్ పార్క్ బాంబింగ్, 1978 నుంచి 95 వరకు జరిగిన పేలుళ్ల వెనుక దేశీయ ఉగ్రవాదుల హస్తమున్నట్టు తేలింది. బోస్టన్ నగరం నడిబొడ్డున జరిగే ఈ మారథాన్ కార్యక్రమంలో ఎవరైనా సులువుగా పాల్గొనవచ్చు. దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏప్రిల్ మూడో సోమవారం నిర్వహించే మారథాన్ 42 కిలోమీటర్ల దూరంపాటు సాగుతుంది. బోస్టన్ పేలుళ్లలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులలో ఎనిమిదిమంది బాలలు ఉన్నారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. ఈ ఘటన నేపథ్యంలో బోస్టన్ నగరంలోని మరో రెండుచోట్ల పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. న్యూయార్క్, లాస్‌ఏంజిపూస్, షికాగో, వాషింగ్టన్ సహా అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు నిందితుపూవరినీ అరెస్టు చేయలేదు. విదేశీ యాసతో, చామనఛాయలో ఉన్న ఓ వ్యక్తి పేలుళ్లకు ముందు అనుమానితంగా తచ్చాడటం దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సీఎన్‌ఎన్ తెలిపింది.

బోస్టన్ పేలుళ్లు ముప్పును చాటుతున్నాయి: ప్రధాని
న్యూఢిల్లీ: బోస్టన్‌లో జరిగిన వరుస పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఖండించారు. ఈ ఘటనలో బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు. కాగా, పేలుళ్ల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని తన ఎంబసీ, న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ వద్ద భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.