దద్దరిల్లిన ఢిల్లీ-తెలంగాణ జేఏసీ పోరుగర్జన

 

samshad
కూతేసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
వేలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమశ్రేణులు
సొంతరాష్ట్రం డిమాండ్‌కు వెల్లు మద్దతు
తెలంగాణ సత్యాగ్రహ దీక్ష తొలిరోజు సక్సెస్
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సొంత రాష్ట్ర ఆకాంక్ష.. హస్తిన పురవీధుల్లో ప్రతిధ్వనించింది. టీ జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి పది జిల్లాల ప్రాతినిధ్యంతో బయల్దేరిన ‘తెలంగాణ ఎక్స్‌వూపెస్’ పెట్టిన కూతకు ఢిల్లీ దద్దరిల్లింది. రాష్ట్రం ఇస్తారా? రాజకీయంగా చస్తారా? తేల్చుకునేందుకు కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి అవకాశమంటూ తెగేసి చెప్పింది. నాలుగున్నర దశాబ్దాలుగా గోస పెడుతున్న తెలంగాణ ప్రజలకు..వారి అభీష్టానికి వివిధ జాతీయ పార్టీల నుంచి మద్దతు వెల్లు టీ జేఏసీ సారథి కోదండరాం నేతృత్వంలో.. వేల మంది తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోటెత్తారు. తెలంగాణ కళాకారుల ఆటపాటలతో దీక్షా ప్రాంగణం జాతరను తలపించింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ఆటలాడుతోందని మండిపడిన ఉద్యమ నేతలు.. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనకు కేంద్రం స్పందించని పక్షంలో లక్షలాది మందితో చలో అసెంబ్లీ నిర్వహణకు ఇక్కడి నుంచే పిలుపునిస్తామని ప్రకటించారు. సంసద్ యాత్ర కాంగ్రెస్‌కు తుది హెచ్చరికని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ స్థాయి ఉద్యమం చేయాలని పలువురు జాతీయ నేతలు సూచించారు.

జేఏసీ గొడుగు కింద ఉద్యమం మరింత ఉధృతం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కాకుండా ఆంధ్రా లాబీ బలంగా పని చేస్తున్నదంటూ అప్రమత్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే ‘దిల్’ కాంగ్రెస్‌కు లేదని తేల్చేశారు. ఉద్యమాలతో.. టీ జేఏసీ సారథ్యంలోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని ఉద్ఘాటించారు. మెయిన్‌స్ట్రీం పత్రిక సంపాదకులు సుమీత్ చక్రవర్తి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌డ్డి, బీజేపీ జాతీయ నాయకులు ప్రకాశ్ జవదేకర్ సహా పలువురు మేధావులు, వివిధ పార్టీల జాతీయ నాయకులు దీక్షాస్థలికి తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు, సంఘీభావం ప్రకటించారు. టీ జేఏసీలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీఆర్‌ఎస్, న్యూడెమోక్షికసీతో పాటు.. సీపీఐ, బీజేపీ, జేడీయూ, ఎన్సీపీ, ఫార్వర్డ్‌బ్లాక్ నేతలు దీక్షా ప్రాంగణానికి వచ్చారు. ఉదయం సరిగ్గా 11 గంటలకు మొదలైన సత్యాక్షిగహ దీక్ష.. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మంగళవారం కూడా దీక్ష కొనసాగనుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.