దత్తన్నను వరించిన కేంద్రమంత్రి పదవి

హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనదైన మార్కుతో కార్యకర్తలతో సత్సంబంధాలున్న బండారు దత్తాత్రేయ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 సంవత్సరాల మధ్య పట్ణణాభివృద్ధి, రైల్వేశాఖా మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు.

దత్తాత్రేయ పాతబస్తీలోని గౌలిగూడలో ఓ నిరుపేద కుటుంబంలో 1947 జూన్ 12 తేదిన జన్మించారు. సైన్స్‌లో పట్టబద్రులయ్యారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు వైష్ణవ్ బండారు, కూతురు విజయలక్ష్మిలు ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌లో ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ రాజకీయనేతగా స్థాయికి ఎదిగారు.

రాజకీయ ప్రస్థానం…

 •   1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక
 •   1975-77లో లోక్ సంఘర్ష సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు
 •   1980లో బీజేపీలో చేరిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం
 •   1997-98, 2006లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
 •   2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు
 •   2010లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం. కేరళ ఇన్‌చార్జిగా బాధ్యతలు
 •   ముఖ్య పదవులు..
 •   1991-1996 మధ్య సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.
 •   1998లో మరోసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి.. 1998-1999 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
 • 1999 సికింద్రాబాద్ ఎంపీగా మూడోసారి విజయం.. 1999-2001 మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు
 • 2001-2003 రైల్వే శాఖ సహాయ మంత్రి, 2003-04 పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
 • 2004, 2009 వరుస ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి
 • 2014లో సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి విజయం.. తాజాగా కేంద్ర మంత్రి పదవి
 • కోకోనట్ బోర్డు, టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు, రైల్వే అడ్వైజరీ బోర్డు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం
This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.