దండయాత్రకు బదులు తీర్చుకుంటాం

 

Etla0 talangana patrika telangana culture telangana politics telangana cinema

‘సీమాంధ్ర నేతలు కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేస్తున్నరు. ఆధిపత్యం కోసం పోటీపడుతూ తెలంగాణ బిడ్డల రక్తాన్ని కళ్ల చూస్తున్నరు. ఇంతకింత బదులు తీర్చుకుంటాం’ అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సిరిసిల్ల ఘటనలో గాయపడి వరంగల్‌లో చికిత్స పొందుతున్న రహీమున్నీసాబేగం, ఎల్లావుల లలిత, హుజురాబాద్‌కు చెందిన విద్యార్థి నాయకుడు పూర్ణచందర్‌ను బుధవారం ఈటెలతోపాటు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పరామర్శించారు. అనంతరం ఈటెల మాట్లాడారు. కన్నకొడుకు జైళ్లో ఉన్నాడని యాగిచేసే విజయమ్మ కళ్ల ఎదుట ఆడబిడ్డలను కొడుతున్నా మానవత్వంలేని మరమనిషిలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

సీమాంధ్రకు చెందిన మఫ్టీ పోలీసులు, కడప గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. ఆనాడు జనగామ చౌరస్తాలో, నేడు సిరిసిల్లలో తెలంగాణ బిడ్డల రక్తాన్ని కళ్ల చూశారని, ఇవి వృథాపోవు, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ బిడ్డలు ఆందోళన నిర్వహిస్తే టీవీ క్లిప్పింగ్‌లు చూసి కేసులు జైళ్లలో పెట్టించిన సీఎం, సిరిసిల్ల ఘటన జరిగి 48 గంటలు గడిచినా ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కనీసం ఎలాంటి చర్యలు కూడాతీసుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు విజయమ్మ, సీఎం కిరణ్ కుమ్మక్కై కడప గూండాలను సిరిసిల్లకు పంపించారని ఆరోపించారు. మహిళలు అనే విచక్షణ మరచి పాశవికంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలన్నీ ఆంధ్రా పార్టీలేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా ప్రతినబూనాం, త్వరలో తెలంగాణలో పాతరేస్తామని హెచ్చరించారు.

కొడుకు కోసమే వైఎస్ సీఎం అయ్యాడు: వినోద్
కొడుకుకు రాష్ట్రంలోని సంపదను దోచిపె వైఎస్ ఐదేళ్లు ముఖ్యమంవూతిగా పనిచేశారని టీఆర్‌ఎస్ లిట్‌బ్యూరో సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. చట్టాన్ని అతిక్షికమించి డబ్బు సంపాదించినందుకే జగన్‌ను జైళ్ల పెట్టారన్నారు. వైఎస్సార్సీపీకి తెలంగాణలో రాజకీయంగా టీఆర్‌ఎస్ చెక్ పెడుతుందన్నారు. తెలంగాణలో వరంగల్ జిల్లాకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, తెలంగాణలో మెడికల్ కళాశాలలకు రావాల్సిన సీట్లు రాకపోవడం వల్ల అదనంగా 150 మంది డాక్టర్లను కోల్పోయామన్నారు. ఆంధ్రాలో ఐదు నర్సింగ్ కళాశాలలు ఉంటే తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒకే ఒక కళాశాల ఉందన్నారు.

రెండోది వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు అప్పటి సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారని, నర్సింగ్ కళాశాల నిర్మాణం కాకముందే పర్మిషన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ఉన్న ఆయుర్వేద కళాశాల్లో అడ్మిషన్లు రద్దు చేశారని, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ లక్ష్మయ్య, సారయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నెబోయిన రాజయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి బక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.