థర్డ్ యానివర్సరీ జరుపుకున్న టీన్యూస్

ఏప్రిల్‌ 4: టీ న్యూస్.. తెలంగాణ గుండెచప్పుడు..

సీమాంధ్ర పాలకులు, చానళ్ల కుట్రలను నిత్యం ఛేదిస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వార్తల రూపంలో ప్రతిధ్వనింపజేస్తూ.. ఉద్యమానికి ఊపిరిలూదుతున్న టీన్యూస్ ఇవాళ థర్డ్ యానివర్సరీ జరుపుకుంటున్నది.  కార్యాచరణ ఉన్నప్పుడు తెలంగాణవాదులు ఉద్యమంలో  పాల్గొని తమ ఆకాంక్షను ఎలుగెత్తి చాటుతున్నరు . కార్యాచరణ ఉన్నా.. లేకున్నా.. మూడు సంవత్సరాలుగా ప్రతినిత్యం టీన్యూస్.. టీన్యూస్ ఎంప్లాయిస్ ఉద్యమం చేస్తూనే ఉన్నరు.  24×365 డేస్ ప్రతిరోజూ ఉద్యమమే.. తెలంగాణ వచ్చేదాక చేస్తూనే ఉంటరు. అన్ని చానల్స్ లో ఉద్యోగులు జీతం కోసమే పని చేస్తరు. కానీ టీన్యూస్ లో మాత్రం జీతంతో పాటు తమ ప్రాంతం కోసం పనిచేస్తరు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొదలుకొని చిన్న ఎంప్లాయ్ వరకు డ్యూటీని ఉద్యమంలాగా చేస్తరు.  టీన్యూస్ అవుట్ పుట్ కంటెంట్ తెలంగాణ ఉద్యకారులకు ఇన్ పుట్ ఇస్తున్నది..   తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నవారిపై టీ న్యూస్ అక్షరకత్తులు నూరుతున్నది. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తదన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ.. సమైక్య కుట్రలపై తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. టీన్యూస్ వలసపాలకుల కుట్రలను ఎండగట్టి…. సీమాంధ్ర చానళ్ల అసలురంగును బట్టబయలు చేస్తున్నది.  ఉద్యమంపై విషంకక్కే ఇంటిదొంగలను.. సీమాంధ్ర వాదులను కుటిలబుద్ధిని కడిగి పారేస్తున్నది. తెలంగాణ కోసమే పనిచేస్తున్న ఏకైక చానల్ టీన్యూస్. తెలంగాణ పోరాటానికి టీన్యూస్ అనే మిస్సైల్ ను అందించిన చానల్ యాజమాన్యానికి పోరుతెలంగాణ  శ్రీనివాస్ కృతజ్ఞతలు..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.