త్వరలో చైనా – భారత్‌ల సమావేశం

న్యూఢిల్లీ : త్వరలోనే బీజింగ్‌లో చైనా – భారత్‌ల మధ్య సమావేశం జరుగుతుందని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. కార్గిల్ 14వ విజయ్ దివాన్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో చైనా – భారత్‌ల మధ్య సరిహద్దులో కొనసాగుతున్న ఘర్షణలకు తెరదించేందుకు చర్చలు జరపుతామని చెప్పారు. దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలోని డెవ్‌సాంగ్ వ్యాలీలో గత 21 రోజులుగా భారత్ – చైనా సరిహద్దులో జరుగుతున్న సంఘర్షణలు బాధాకరమన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.