తొలివిడుత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడుత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణలో 17 ఎంపీ, 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ. 10న నామినేషన్ల పరిశీలన, 12 వరకు ఉపసంహరణ గడువు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.