తేడావస్తే కోదాడ నుంచే యుద్ధం -కేటీఆర్

‘పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు టీఆర్‌ఎస్ శ్రేణులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ నాయకత్వంలో సంపూర్ణ తెలంగాణ సాధించేందుకు నిరంతర పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. అవిశ్వాసం ము సుగులో ముగ్గురు బాబులు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. ఏమైనా తేడా వస్తే 1969 ఉద్యమవీరుల స్ఫూర్తితో సరిహద్దు ప్రాంతమైన కోదాడ నుంచే యుద్ధం మొదలవుతుంది’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా కోదాడలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన నకిరేకల్, కోదాడలో ప్రసంగించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ముగ్గురు బాబులు పార్లమెంట్‌లో ఆవిశ్వాసం తీర్మానానికి నోటీసు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీలకు చెందిన తెలంగాణ ఎంపీపూవరూ సంతకం చేయకున్నా సమైక్యాంవూధకు రాష్ట్రంలో 75 శాతం సానుకూలమని లగడపాటి ఎలా చెప్తాడని నిలదీశారు. ముగ్గురు బాబులకు పిచ్చి పీక్‌పూవల్‌కు చేరిందని విమర్శించారు.
ktttter
కిరణ్ కిరికిరి ముఖ్యమం త్రి, మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, తెలంగాణలో జెండా జగన్ పీకేశాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చర్చకు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ ఊసర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటున్న 63 ఏళ్ల బాబు..420 ఏళ్ల క్రితమే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ తెస్తున్నామని కాంగ్రె స్ నేతలు ఊరేగింపులతో విజయోత్సవాలు జరుపుకోవడంలో అర్థం లేదన్నారు. 14 ఏళ్ల టీఆర్‌ఎస్ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ కృషి, వెయ్యిమంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిందన్నారు. 13 ఏళ్ల కిందటే నల్లగొండ జిల్లాలో సీమాంధ్ర పాలకుల జలదోపిడీని వివరించేందుకు కోదాడ నుంచి హాలియాకు కేసీఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో అసెంబ్లీలో నిషిద్ధమైన తెలంగాణ పదం నేడు కేసీఆర్ పోరాటాలతో నిత్యం పతాక శీర్షికన నిలుస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌తోపాటు జేఏసీ, బీజేపీ, న్యూడెమోక్షికసీ, సీపీఐ కీలకపాత్ర పోషించాయని ప్రశంసించారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.