తెలుగు మహాసభల్లోనూ తెలంగాణపై వివక్ష

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ తెలంగాణ కళాకారులకు వివక్షే ఎదురైంది. కరీంనగర్ , రంగారెడ్డి జిల్లాల ఒగ్గు కళాకారులకు తమ కళను ప్రదర్శించే అవకాశం ఇవ్వక పోవడంతో వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు రావాలని లేకున్న ప్రభుత్వ అధికారులు పిలిపించి అవమానం చేశారని తెలంగాణ కళాకారులు ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 90 శాతం తెలంగాణ వాదులు, కళాకారులు ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించిన విషయం తెలిసిందే.
దాదాపు 200 మంది కళాకారులను అధికారులు పిలిపించి అవమాన పరిచటంపై ఆగ్రహం వ్యక్తమైంది. వాస్తవానికి నిన్న ఉదయమే ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఉండాలి. కానీ అక్కడున్న నిర్వాహకులు కావాలనే తమకు అవకాశం ఇవ్వలేదని కళాకారులు ఆరోపించారు. ఇదేంటని అధికారులను నిలదీస్తే.. ఏంచేస్తారో చేసుకోపోండి… ఇక్కడ మావారికే సమయం సరిపోవట్లేదని బెదిరింపులకు పాల్పడినట్లు ఒగ్గు కళాకారులు చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతికి ఒక ఆత్మ లాంటి కళ ఒగ్గు కథ అని, ఇలాంటి కళకు అవమానం జరగటం యావత్ తెలంగాణ సంస్కృతిని అవమాన పరిచినట్లేనని, ద్నీన్ని తెలంగాణ కవులు, కళాకారులు తీవ్రంగా ఖండించారు. అవి తెలుగు మహాసభలు కావని, ఆంధ్ర మహాసభలని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ పట్ల సీమాంధ్ర వివక్ష ఎంటో స్ఫష్టంగా తెలుస్తోందని ఆయనన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.