తెలంగాణ సాధనలో మరో అడుగు: కోదండరాం

హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ముగియడం హర్షణీయమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో మరో ముందడుగు వేశామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులను కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పమన్నారుగానీ తీర్మానాలు, ఓటింగ్ చేయమని కేంద్రం చెప్పలేదని తెలిపారు. ఏదేమైనా చివరికి అంతిమ నిర్ణయం మాత్రం కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.