తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఎలా చేరుతారు- కోమటిడ్డి బ్రదర్స్‌కు ఎంపీ పాల్వాయి ప్రశ్న

palvai
కోమటిడ్డి సోదరులు కాంగ్రెస్‌ను వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టంలేదని, వారికి ధనార్జనే ధ్యేయమని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌డ్డి పేర్కొన్నారు. వారికి పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకంలేదని, వారు పార్టీని వీడటం ఊహించినదేనని అన్నారు. వారు డబ్బులతో పార్టీ టికెట్లు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకుంటున్న కోమటిడ్డి వెంకట్‌డ్డి తెలంగాణ వ్యతిరేక పార్టీలో చేరి ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. ఆయన తెలంగాణ కోసం దొంగ దీక్ష చేశారని, రాత్రి వేళల్లో భోజనం చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టెందుకే దీక్ష చేశారని ధ్వజమెత్తారు. జగన్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఎంపీ రాజగోపాల్‌డ్డి పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో జగన్ ప్లకార్డు పట్టుకున్నది మర్చిపోయారా? అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకున్నది వైఎస్ రాజశేఖర్‌డ్డేనని, ఆయన తెలంగాణ ద్రోహి అని పాల్వాయి మండిపడ్డారు. కోమటిడ్డి బ్రదర్స్‌తో ఎమ్మెల్యే లింగయ్య తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ వెళ్లబోరని పేర్కొన్నారు.

కోమటిడ్డి బ్రదర్స్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కారని.. వారు కాంట్రాక్టర్లు మాత్రమేనని, డబ్బలు సంపాదించుకోవడానికే పార్టీలోకి వచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్రం ఆదేశించి నోటు పంపిస్తే.. వైఎస్ మాత్రం కేంద్రం రాసిన లేఖ సారాంశాన్ని మార్చి చదివారని ఆయన విమర్శించారు. ఎంపీ రాజగోపాల్‌డ్డి కాంట్రాక్టులు సాధించుకోవడానికి సీఎం వద్ద మంచి పేరు కోసం ఎంతో ప్రయత్న చేశారన్నారు. ఎంపీలంతా పార్లమెంట్‌లో తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేస్తున్నా.. ఆయన మాత్రం బయటనే ఉన్నారన్నారు. జగన్ ప్రభావం తెలంగాణలో ఉండదన్నారు. తెలంగాణ కోరుకునేవారికే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు.

సీఎం వ్యవహారశైలిపైనే అనుమానం ఉంది
కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారిని ప్రోత్సహించేలా సీఎం కిరణ్‌కుమార్‌డ్డి వ్యవహరిస్తున్నారని పాల్వాయి గోవర్దన్‌డ్డి ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎక్కువగా లబ్ధిపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే కాంగ్రెస్‌ను వీడుతున్నారన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. సీఎం కిరణ్‌పైనే అనుమానం కలుగుతుందన్నారు. ఎంపీ రాజగోపాల్‌డ్డికి ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టును అప్పగించారన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.