తెలంగాణ వైద్యులపై సీమాంధ్ర సర్కార్ చిన్నచూపు

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి చెందిన వైద్యులపై సీమాంధ్ర సర్కార్ చిన్నచూపు చూస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ డాక్టర్లను పక్కనబెట్టి, జూనియర్ అయిన సీమాంధ్రకు చెందిన శివరామిరెడ్డికి ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పదవి కట్టబెట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శివరామిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం తీరుపై తెలంగాణ డాక్టర్లు, వైద్య సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ డాక్టర్ సువర్ణను పక్కకు పెట్టడం దారుణమన్నారు. డాక్టర్ సువర్ణను సూపరింటెండెంట్ ఛాంబర్‌లో కూర్చోబెట్టి తెలంగాణ మెడికల్ జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. శివరామిరెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేసి తెలంగాణ డాక్టర్‌ను సూపరింటెండెంట్‌గా నియమించాలని మెడికల్ జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ డాక్టర్‌ను సూపరింటెండెంట్‌గా నియమించే వరకు తాము పోరాడుతామని మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.