తెలంగాణ విద్యార్థిపై సీమాంధ్ర విద్యార్థుల దాడి

తమిళనాడులో ఘటన
– రాష్ట్ర ప్రకటనతో సంబురాలు జరుపుకున్నాడని అఘాయిత్యం
సమైక్యాంవూధులు ఓ పక్క కలిసుందామంటూనే.. మరోపక్క తెలంగాణవాదులపై భౌతికదాడులకు పాల్పడుతూ తమ నైజాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే వారు దోపిడీ, దాడులు చేస్తుండగా.. తాజాగా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణవాదులపై కూడా దాడుల పరంపర కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రమేష్ అనే తెలంగాణ విద్యార్థిపై ఐదుగురు సీమాంధ్ర విద్యార్థులు తమిళనాడులో దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బాధితుడు ఫోన్‌లో ‘టీ మీడియా’కు వివరించారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్‌టీపీసీ జ్యోతినగర్‌కు చెందిన ఎన్ రమేష్ (24) రంగాడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూర్‌లోగల జేబీఐటీ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం తమిళనాడులోని తంజావూర్ తిరుమలై సమువూదంలోని శాస్త్రా యూనివర్శిటీలో ఎంటెక్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న రమేష్ అక్కడే ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. అదే హస్టల్‌లో ఉంటు న్న ఆంధ్రలోని ఒంగోలుకు చెందిన ఆరుగురు విద్యార్థులు రమేష్ తెలంగాణకు జరిగిన అన్యాయం వివరిస్తున్న ప్రతిసారీ ఎగతాళి చేయడంతోపాటు గొడవపడుతుండేవారు. ఇటీవల కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో రమేష్ సంబురాలు జరుపుకున్నాడు. దీనిని మనసులో పెట్టుకున్న సీమాంధ్ర విద్యార్థులు ఆదివారం మధ్యా హ్నం రమేష్ నిద్రలో ఉండగా దాడి చేశారు. దీంతో అతడి ముఖంపై గా యాలుకావడంతో తోటి విద్యార్థులు ఆస్పవూతికి తరలించి చికిత్స చేయించారు. ఈ దాడిపై రమేష్ ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. మరోపక్క తెలంగాణ నుంచి సీమాంవూధకు వెళ్తున్న ట్రావెల్స్‌పై కూడా సమైక్యవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.