తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు బాట పట్టారు. వర్సిటీ అధ్యాపకుల నియామకం విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వారు నిరసన తెలుపుతూ బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఇద్దరూ ఈ విషయంపై విద్యార్థులతో చర్చలు జరిపారు. కాగా, విద్యార్థులతో మీరెందుకు చర్చలు జరిపారని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌లపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఇద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేసినట్టు సమాచారం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.