తెలంగాణ వచ్చాకే నియామకాలు చేపట్టాలి

-నాన్‌లోకల్ కోటా ద్వారా తెలంగాణలోకి సీమాంధ్ర ఉద్యోగులు
– గ్రూప్-2, గ్రూప్-4 జిల్లా పోస్టుల్లో చొరబడే అవకాశం
– టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాకే ఉద్యోగాలు భర్తీ చేయాలి
– డీఎస్సీ 2013 నోటిఫికేషన్ కూడా తెలంగాణ ఏర్పడ్డాకే
-తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాతే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 12, 377 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వారంరోజుల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లోని వివిధ కేటగిరీల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించేందుకు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్‌వైడ్ మెరిట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, మిగితా గ్రూప్-1, 2, 4 కేటగిరీ పోస్టుల్లో నాల్ లోకల్ కోటా ద్వారా, ఇతర అక్రమ పద్ధతుల్లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నాటినుంచి సుమారు లక్ష తెలంగాణ ఉద్యోగాల్లో సీమాంవూధులు అక్రమంగా దోచుకున్నారని తెలంగాణ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు సచివాలయంతోపాటు ఇతర శాఖల్లో డిప్యు పేరుతో హైదరాబాద్‌లో తిష్ట వేయటం కారణంగా ఈ డిప్యూ స్థానాలను సీమాంధ్ర ప్రభుత్వం ఖాళీలుగా చూపటం లేదు. దీనితో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరిగింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇంకా కొద్ది దూరంలో ఉన్న ఈ సమయంలో సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా తెలంగాణలోని ఖాళీల భర్తీ ప్రక్రియలో సీమాంధ్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. రాష్ట్రం విడిపోతున్న దశలో మరింత మంది సీమాంవూధులను తెలంగాణలో నియామకం చేయటం ద్వారా తెలంగాణ నిరుద్యోగులకు ద్రోహం చేయడానికి సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. గత పదేళ్లలో ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది.

ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఏడు జోన్ల విధానం అమలులో ఉంది. కొన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దొరకరనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లుగా విభజించారు. ఇందులోఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలు, తెలంగాణ జిల్లాలు ఒక మల్టీ జోన్‌గా, కోస్తాంవూధలోని మిగితా జిల్లాలు, రాయలసీమ జిల్లాలను కలిపి రెండవ మల్టీ జోన్‌గా విభజించారు. ఇందులో సీమాంవూధులనే ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేసే అవకాశం ఉంది. జోనల్ పోస్టులుగా ఉన్న గ్రూప్-2లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులున్నాయి. నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 30శాతం స్థానికేతరులతో, 70శాతం పోస్టులను స్థానికులతో భర్తీ చేయాలి. గెజిటెడ్ పోస్టుల భర్తీలో 60శాతం స్థానికులతో, 40శాతం స్థానికేతరులతో భర్తీ చేస్తారు.

40శాతంలో సీమాంవూధులను ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేస్తే తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. ఇక గ్రూప్-4 పోస్టుల్లో 80శాతం స్థానికులతో, 20శాతం స్థానికేతరులతో భర్తీ చేయాలి. నాన్‌లోకల్ పోస్టుల్లో తెలంగాణ జిల్లాల్లో రాష్ట్రంలోని ఏ జిల్లా వారితోనైనా ఓపెన్ మెరిట్ ద్వారా భర్తీ చేయవచ్చు. కానీ సీమాంధ్ర అభ్యర్థులు ఓపెన్ మెరిట్‌లో వచ్చేందుకు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. డీఎస్సీ 2013 నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల్లో డీఎస్సీ 2013 నోటిఫికేషన్ ద్వారా 21508 పోస్టులతో ప్రకటన జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీ ద్వారా కూడా స్థానికేతరులు తెలంగాణ జిల్లాల్లో నియామకమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వివిధ డీఎస్సీల ద్వారా హైదరాబాద్, రంగాడ్డి, నల్గొండ, మెదక్‌తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో ప్రవేశించి తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఉపాధ్యాయ పోస్టులు జిల్లా పోస్టులు. 80 శాతం స్థానికులు, 20 శాతం స్థానికేతరులతో భర్తీ చేయాలి. 20 శాతం నాన్‌లోకల్ కోటా పూర్తి స్థాయిలో సీమాంవూధులతో భర్తీ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.