తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఉంది – 103 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష

avva

‘తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఉంది. మన రాష్ట్రం వస్తేనే మన బిడ్డల బతుకులు మారుతాయి..’ ఈ మాటలను ‘కరీంనగర్ కదనభేరి’ వేదికగా 103ఏళ్ల ఓ వృద్ధురాలు అన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం గాదెపెల్లి పంచాయతీ పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన నాగన్నగారి బుచ్చవ్వ(103) గురువారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పుకొని తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు తీసుకువస్తారు బిడ్డా అంటూ అక్కడి వారిని ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఉందంటూ కోరారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయన్నారు. ‘ఈ లొల్లిలో నన్ను కూడా తీసుకుపొండ్రి. ఏడికంటే ఆడికొత్తా. నా మునిమనుమడిని చూసినట్లు మన తెలంగాణ రాష్ట్రాన్ని సూడాలని ఉంది..’ అని తన ఆకాంక్షను చాటిచెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.