తెలంగాణ రాష్ట్రం కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

die

– ప్రత్యేకవాదాన్ని ఓడించే కుట్రలు చూసి.. తనువు చాలించిన వేణు
– తన చావుతోనైనా నేతల్లో మార్పురావాలని లేఖ
– కన్నీరు మున్నీరవుతున్న తల్లిదంవూడులు
– విషాదంలో నల్గొండ జిల్లా గౌరాయపల్లి
స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించి తెలంగాణవాదం లేదని నిరూపించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు చూసి తట్టుకోలేక తనువు చాలించాడు. తన ఆత్మార్పణంతో నాయకుల ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశించి జీవితాన్ని ముగించాడు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన వరగంటి నర్సమ్మ, అంజయ్య మూడో కుమారుడైన వరగంటి వేణు (23) ఐటీఐ చదివి కరీంనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం కార్యకర్తలతో కలిసి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ఒక్క టీఆర్‌ఎస్ తప్ప.. ఇతర పార్టీలవారు కులాలవారీగా డబ్బు పంపకాలు చేస్తుండటం చూసి తట్టుకోలేకపోయాడు. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఓ పక్కన సీమాంధ్ర నేతలు అడ్డదారుల్లో అడ్డుపడుతుండగా.. స్థానిక ఎన్నికల్లో డబ్బు పంపకాలు చేసి ప్రత్యేకవాదం లేదని నిరూపించేందుకు ఆయా పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను చూసి రగిలిపోయాడు. ఎలాగైనా ఎదిరించి ఈ పంపకాలను నిలిపివేయాలని తోటివారికి చెప్పాడు. ఈ పంపకాలను అడ్డుకుందామని టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా నిర్ణయం చేశారు.

అయితే.. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పనిఉందని చెప్పి వెళ్లిన వేణు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే తల్లిదంవూడులు పనులకోసం బావుల వద్దకు వెళ్లగా, నాయనమ్మ పక్కింటికి వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లోని దూలానికి వేణు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నాయనమ్మ ఇంట్లోకి వచ్చి చూడగా దూలానికి శవమై వేలాడుతూ వేణు కన్పించడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. విషయం తెలుసుకున్న తెలంగాణవాదులు పెద్ద ఎత్తున వేణు ఇంటికి తరలివచ్చారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచడం వల్లనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కొడుకు జేబులోని సూసైడ్ నోట్‌ను చూపిస్తూ తల్లిదంవూడులు విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాకు చూపించాలని కోరగా శాంతిభవూదతల సమస్య తలెత్తుతుందని ఎస్సై నర్సింహారావు నిరాకరించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌డ్డి, జిల్లా నాయకులు కర్రె వెంకటయ్య, గుజ్జుల శ్రీనివాస్‌డ్డి పట్టుబట్టడంతో సూసైడ్ నోట్‌ను ఎస్సై చదివి వినిపించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీ నిర్వహించిన అనేక ఉద్యమాలలో వేణు చురుకుగా పాల్గొనేవాడు. సకల జనుల సమ్మె సందర్భంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొన్న వేణు, రచ్చబండను అడ్డుకుంటూ జేఏసీ నిర్వహించిన కార్యక్షికమాల్లో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో జరిగిన ధూంధాం కార్యక్షికమంలోనూ పాల్గొన్నాడు. వేణు ఆత్మహత్యతో గ్రామంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.