తెలంగాణ రచయితల వేదిక నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

 

కరీంనగర్: తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని వేదిక అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, సూరేపల్లి సుజాత కరీంనగర్‌లో ప్రకటించారు. బుధవారం తెలంగాణ రచయితల వేదిక ముఖ్య కార్యవర్గ సమావేశాన్ని జూకంటి జగన్నాథం అధ్యక్షతన నిర్వహించిన తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా జూలూరు గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శిగా సూరేపల్లి సుజాత, ఉపాధ్యక్షులుగా నాళేశ్వరం శంకరం, అన్నవరం దేవేందర్, అనిశెట్టి రజత, పొట్లపల్లి శ్రీనివాసరావు, కే ముత్యం, పెద్దింటి అశోక్‌కుమార్, వసంత్‌రావు దేశ్‌పాండే, డాక్టర్ అప్పాల చక్రధర్, కార్యదర్శులుగా డాక్టర్ దామెర రాములు, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ఎనిశెట్టి శంకర్, ఉదారి నారాయణ, బెల్లి యాదయ్య, బుర్ర తిరుపతి, వీఆర్ విద్యార్థి, ప్రసేన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మల్లయ్య, తుర్లపాటి లక్ష్మి, సంకెపల్లి నాగేంవూదశర్మ, కొండె మల్లాడ్డి, కోశాధికారిగా మద్దికుంట లక్ష్మణ్‌లను నియమించారు.

రాష్ట్ర సలహాదారులుగా ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు, అల్లం నారాయణ, టంకశాల అశోక్, కే శ్రీనివాస్, కే రామచంద్రామూర్తి, అఫ్సర్, సీతారాం వ్యవహరిస్తారని గౌరీశంకర్, సుజాత తెలిపారు. సమావేశంలో తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, పెద్దింటి అశోక్‌కుమార్, మద్దికుంట లక్ష్మణ్, గాజోజు నాగభూషణం, బూర్ల వెంక తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.