తెలంగాణ యూనివర్సిటీలో సోషల్ మీడియాపై సెమినార్

తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో  ‘సామాజిక మాధ్యమాలు-సవాళ్లు, సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీ య స్థాయి సెమినార్ జరిగింది. సెమినార్‌కు పీఎల్ విశ్వేశ్వరరావు, షిండే ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. సెమినార్ కు ఓయూ జర్నలిజం విభాగాధిపతి బాలస్వామి హాజరయ్యారు.  సోషల్ సైన్సెస్ డీన్  ప్రొ.శివశంకర్  సెమినార్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్లు చంద్రశేఖర్, రాజారాం సెమినార్ పనులను పర్యవేక్షించారు.

దేశంలో 92 వేల పత్రికలు, 825 టెలివిజన్ చానళ్లు ఉన్నాయని, అయితే ఈ ప్రసార మాధ్యమాలు కొద్దిమంది బలవంతులు,ధనవంతుల గుప్పిట్లోనే ఉండటం విచారకమని పీఎల్వీ అన్నరు . బాధితులు, సామాన్యులకు అండ గా ఉండాల్సిన మీడియా… కొన్ని ఒత్తిడిల కారణంగా వారి పక్షా న్ని విస్మరించడం తగదన్నారు. సంప్రదాయబద్ధమైన మీడియా నిర్వహించని కొన్ని బాధ్యతల్ని సోషల్ మీడియా నిర్వహిస్తుందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వార్త వేగవంతంగా ప్రపంచమంతా చేరుకోగలిన శక్తి ఉండటం వల్లే సోషల్‌మీడియా  బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యతలు ఉన్నాయని, వీటిని గుర్తించకపోతే సమాజంలో  విపరీత పరిణామాలు తప్పవన్నారు.

ఈ సెమినార్ లో వందలాది మంది విద్యార్థులు రీసెర్చ్ ఆర్టికల్స్ సమర్పించారు.

 

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.