తెలంగాణ భవన్‌లో రీసెర్చ్ సెంటర్

తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో తెలంగాణ భవన్‌లో రీసెర్చ్ అండ్ రిఫరల్ సెంటర్ ప్రారంభమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని, తెలంగాణ చరివూతకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా ఈ సెంటర్‌లో ఇవ్వవచ్చని, ఇక్కడి నుంచి ఎవరైనా సమాచారం తీసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటిదాకా మరుగున పడి ఉన్న తెలంగాణ చరివూతను సేకరిస్తున్నామని, ఈ రీసెర్చ్ సెంటర్‌లో నేతల ప్రసంగాలు, పుస్తకాలు, వీడియోలు, ఆడియోలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. తెలంగాణ అంశంపై పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు కావాల్సిన సమాచారం సైతం ఇక్కడ అందుబాటులో ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని ఎన్నో ప్రాంతాల్లో ఆదిమానవులు సంచరించిన జాడలున్నాయని, పూర్వ చారివూతక యుగం మొదలు తెలంగాణ రాష్ట్ర సాధన దాకా ఘనమైన చారివూతక వారసత్వం ఇక్కడి ప్రజలకు ఉందన్నారు. ఈ సమాచార సెంటర్ ఒక నిధిలా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని కవిత ఆకాంక్షించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.