తెలంగాణ బిల్లు సవరణలపై టీజేఏసీ దృష్టి

తెలంగాణ ముసాయిదా బిల్లులో లోటుపాట్ల సవరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యచరణ కమిటీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా ఐక్యంగా అసెంబ్లీలో బిల్లు ముసాయిదాపై చర్చను తొందరగా ముగిసేలా చూడాలని ఆయన సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యాలయంలో టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్, జగదీశ్వర్‌డ్డి, టీఎన్జీవో నేత దేవీవూపసాద్, విఠల్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తదితరులు హాజరై ముసాయిదాపై చర్చించారు.

అనంతరం సమావేశం వివరాలను కోదండరాం విలేకరులకు వెల్లడించారు. పటిష్టమైన తెలంగాణ కోసం బిల్లులో అనేక అంశాలు సరిచేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే సమావేశాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లుపై ఏకతాటిపై నిలబడేలా కృషిచేయడంతోపాటు, బిల్లు లోటుపాట్ల సవరణ కోసం కేంద్రం పై ఒత్తిడి తేవడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు చెప్పారు.

అందులో భాగంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కలుస్తామని అన్నారు. ఒకవూటెండు రోజుల్లో సవరణలపై పూర్తిస్థాయిలో డ్రాఫ్టింగ్ పూర్తి చేస్తామని, అనంతరం ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నేతలను కలుస్తామన్నారు. తెలంగాణ బీజేపీ ఉద్యమ కమిటీ చైర్మన్ టీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజన చేయాలని డిమాండ్ చేశారు. నెల్సన్ మండేలాతోపాటు తెలంగాణకోసం సాయుధ పోరాటం చేసిన రావెళ్ళ వెంకవూటామిడ్డికి శ్రద్ధ్ధాంజలి ఘటించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ కో చైర్మన్ అశోక్‌కుమార్‌యాదవ్, సీపీఐఎంఎల్ న్యూడెమొక్షికసీ నాయకుడు నైనాల గోవర్ధన్, సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్, జేఏసీ నాయకులు రవీందర్‌డ్డి, కత్తి వెంకటస్వామి, మామిడి నారాయణ, జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, హైదరాబాద్ నగర తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ అధ్యక్షులు ఎంబీ. క్రిష్ణాడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీ టీడీపీ నేతలను కలిసిన కోదండరాం
కీలక సమయంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ నేతలంతా ఐక్యంగా ఉండి రాష్ట్ర ఏర్పాటు జరిగేలా చూడాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణ టీడీపీ ఫోరం నేతలను కోరారు. బుధవారం సాయంత్రం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి ఆయన తన బృందం సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా కోదండరాం టీడీపీ ఫోరం నేతలైన ఎర్రబెల్లి, మోత్కుపల్లిలతో మాట్లాడుతూ ఈ కీలక సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అనేక అనర్థాలు వస్తాయన్నారు. ఎర్రబెల్లి, మోత్కుపల్లి మాట్లాడుతూ తప్పకుండా బిల్లు ఆమోదానికి తమ కృషి ఉంటుందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి పార్టీ పరంగా తాము ఏమి చేయాలో అది చేస్తామని కోదండరాంకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.