తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుకు భారతీయ జనతాపార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందుకు హాజరైన బీజేపీ అగ్రనేతలు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానికి వారు హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని విందుకు హాజరైన కేంద్ర మంత్రి కమల్‌నాథ్ స్ఫష్టం చేశారు. పార్లమెంటులో బిల్లు ఎప్పుడు ప్రవేశ పెట్టాల అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని ఆయన చెప్పారు. ప్రధాని విందు సమావేశానికి బీజేపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోని, కమల్‌నాథ్‌లు హాజరయ్యారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.