తెలంగాణ బంద్ విజయవంతం

హైదరాబాద్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా చేపట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. హైదరాబాద్‌తో పాటు 10 జిల్లాల ప్రజలు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. ముఖ్యంగా ఆర్టీసీ సంఘాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వాపార సంస్థలతో పాటు ఇతర ప్రైవేటు కార్యాలయాలు, పెట్రోల్ బంకులు మూతపడాడయి. హైదరాబాద్‌లో బంద్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు సహకరించిన తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ ధన్యవాదాలు తెలిపింది. 10 జిల్లాల తెలంగాణనే ప్రజలు కోరుకుంటున్నారన్న దానికి ఈ బంద్ నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.