తెలంగాణ బంద్ విజయవంతం

-సమైక్యాంధ్ర సభ.. తెలంగాణ హక్కులపై దాడి
-టీ జేఏసీ చైర్మన్ కోదండరాం

తెలంగాణ ప్రజలు పాశవిక నిర్బంధకాండను ఎదురొడ్డి.. స్వరాష్ట్రం కోసం నినదించి, తెలంగాణ బంద్‌ను విజయవంతం చేశారని టీ జేఏసీ ప్రకటించింది. ప్రజలు తెలంగాణ ఆకాంక్షను మరోసారి మహత్తరంగా బంద్ ద్వారా చాటారని పేర్కొంది. తెలంగాణ ఉద్యమశక్తిని, తెలంగాణ ప్రజల స్ఫూర్తిని అభినందిస్తూ, జేజేలు ప్రకటించింది. శనివారం టీఎన్జీవో భవన్‌లో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. టీ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం, కో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, కో చైర్మన్ సీ విఠల్, కో చైర్మన్ కారం రవీందర్‌డ్డి, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, న్యూడెమొక్షికసీ నాయకులు గోవర్ధన్, సంధ్య (చంవూదన్నవర్గం), హైదరాబాద్ జేఏసీ చైర్మన్ ఏ శ్రీధర్, కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్, జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, పౌరహక్కుల నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, మాలమహానాడు కన్వీనర్ మధుసూదన్, తెలంగాణ సినిమా హీరో రోషం బాలు, టీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్ సత్యంగౌడ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ పోలీసుల దాడిలో గాయపడ్డ దూదిమెట్ల బాలరాజ్‌కు, ఆయనతోపాటు తీవ్రగాయాలపాలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

నిజాం కాలేజీ హాస్టల్ భవనం నుంచి పోలీసుల దాడిలో కిందపడి నడుము విరిగిన విద్యార్థికి ప్రభుత్వమే వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ అరాచకానికి సీఎం కర్త కర్మ క్రియగా ఉన్నారని విమర్శించారు. జీ దేవీవూపసాద్ మాట్లాడుతూ సీమాంధ్ర పరిరక్షణ వేదిక పేరుతో అశోక్‌బాబు నిర్వహించిన సభ తెలంగాణ ఆకాంక్షలపైన దాడిగానే తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని స్పష్టం చేశారు. అశోక్‌బాబు సభ, రాజ్యాంగవ్యతిరేకం, చట్టవ్యతిరేకమని మండిపడ్డారు. సీ విఠల్ మాట్లాడుతూ ఇంతకాలంగా హైదరాబాద్‌లో ఎంతమంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారనే విషయంలో రకరకాల వాదాలు ఉన్నాయని, అయితే హైదరాబాద్‌లో 40 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారని అశోక్‌బాబు లెక్క చెప్పినందుకు సంతోషంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యాలయాలలో జరిగిన దాడిని విద్యార్థుల హక్కులపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని అన్నారు. న్యూడెమొక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ న్యూడెమొక్షికసీ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌వద్ద ప్రదర్శన చేస్తుండగా అక్రమంగా 150 మందిని అరెస్టు చేశారని వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.