తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా ఉద్యోగులను భరించదు: కేసీఆర్

ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తెలంగాణలో ఉండేలా చూస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని తెలిపారు.  ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి ఇక్కడే ఉంచితే తెలంగాణ వచ్చి ఏంలాభమని కేసీఆర్ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం భరించదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అవసరమైతే మళ్లీ అద్బుతమైన ఉద్యమం నిర్మించి ఆంధ్రా ఉద్యోగులను పంపివేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వొద్దని జైరాం రమేష్‌కు చెప్పామని ఒక్కసారి కూడా ప్రజల ఓట్లతో గెలవని ఆయనకు తెలంగాణ ప్రజల బాధ అర్థంకాలేదని విమర్శించారు. ఆప్షన్ల పేరుతో ఆంధ్రా వాళ్లను ఇక్కడే ఉండనిస్తే తెలంగాణ సెక్రటేరియట్‌లో 90 శాతం ఆంద్రోళ్లే ఉంటారని వివరించారు. తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులు ఎలా ఉంటారని నిలదీశారు. ఆంధ్రా సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులు ఉండాలని, తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఉండాలని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలోఉండనీయమని, అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా వాళ్లను పంపివేస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ సిటీ, వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.