తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మన్‌కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని.. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమని ప్రశసించారు. అందరం కలిస్తేనే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు. తెలంగాణలో టాయిలెట్ల నిర్మాణం భేష్ అన్నారు. స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమంలో 23 రాష్ర్టాల నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారని వెల్లడించారు. గంగదేవిపల్లిలో ప్రతి ఇంట్లో స్వచ్ఛత పాటిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 17, 18న మరుగుదొడ్ల శుభ్రత కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. మరుగుదొడ్ల శుభ్రత కార్యక్రమంలో అధికారులు స్వయంగా పొల్గొన్నారని తెలిపారు. మరుగుదొడ్ల శుభ్రతలో అధికారులు పాల్గొంటే ప్రజలు ఎంతో ప్రభావితులవుతారని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛత, శుభ్రత కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందన్నారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛతపై అవగాహన కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS, TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *