తెలంగాణ బలహీనవర్గాల నేతలు, బలహీనవర్గ సంఘాల నేతలు ఎక్కడ పన్నరు?

హక్కుల సంఘాలు, అజ్ఞాన వేదికలు, మూర్ఖపు హేతువాదులు మూకుమ్మడిగా ప్రజలకు నిస్వార్థ సేవచేయకుండా అడ్డుకోవడానికి యత్నిస్తున్నరు. రాక్షసప్రయత్నాలన్నీ చేస్తున్నరు.  విషప్రచారాలతో బత్తిన కుటుంబాన్ని అభాసుపాలు చేస్తున్నరు. ఇంత జరుగుతున్నా తెలంగాణ బలహీనవర్గాల నేతలెవ్వరూ  స్పందించిన పాపాన పోలేదు.  బత్తిన సోదరులు ప్రజలను మోసం చేసి పైసలు సంపాదించడంలేదు.. దేవుళ్లమని పూజలు చేయించుకోవడంలేదు. వంశపారంపర్యంగా అబ్బిన విద్యతో పేదలకు సాయం చేస్తున్నరు.

దేశంలో ఏ మూలనో బలహీనవర్గాలపై కామెంట్ చేస్తే.. ధర్నాలు, రాస్తారోకోలు చేసే బడుగుబలహీన వర్గాల సంఘాలు, బహుజన సంఘాలు, వాటి ప్రతినిధులమని చెప్పుకునే బాకా నేతలు.. బత్తిన సోదరులకు అన్యాయం జరుగుతుంటే అన్నీ మూసుకుని కూర్చున్నరు. చేపమందుకు అడ్డుపడుతున్న దుష్టశక్తులకు ఆఫర్ చేసినట్టు ఫార్మా కంపెనీలు మీకు కూడా ఏదైనా ఆఫర్ చేసినయా.. ఎందుకయా సంఘాలు పెట్టుకొని సంకలు గుద్దుకునుడు.. సాటి బీసీకి అన్యాయం జరిగితే స్పందించని మీవో సంఘాలు.. మీరో ప్రతినిధులు..

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.