తెలంగాణ..తుఫాన్ కాదు సునామీ- కేటీఆర్

‘తెలంగాణకు ఒక్కపైసా ఇయ్యనన్న సీఎం కిరణ్, తుఫాన్‌ను ఆపలేనుకానీ, విభజన ఆపుతానని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు.
ktr
తెలంగాణ తుఫాన్ కాదు.. సునామీ ఆపడం ఎవరి తరం కాదు. సీఎం కిరణ్‌వి దింపుడు కల్లం ఆశలే’ అని ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రకు నీళ్లురావని, ఉద్యోగాలు రావని కిరణ్ పేర్కొనడం, మరోపక్క ఉండవల్లి అరుణ్‌కుమార్ విభజన జరిగితే తెలంగాణ నష్టపోతుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం అంకుసాపూర్‌లో ఆయనకు జరిగిన సన్మాన సభలో, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ముందుంటామని, పాలనా పగ్గాలు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణతోనే సమస్యలు పరిష్కరామవుతాయన్నారు. తెలంగాణలోఉద్యమం, ఆత్మబలిదానాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించనున్నదన్నారు. తెలంగాణ బిల్లు పాసయ్యేకే సంబురాలు జరుపుకుందామన్నారు. రాబోయే తెలంగాణలో పునర్నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ వద్ద స్పష్టమైన విధివిదానాలు ఉన్నాయని, తెలంగాణను అభివృద్ధి చేసే సరైన నాయకుడు ఆయనే అని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.