తెలంగాణ డ్రాఫ్టు బిల్లుపై టీ జేఏసీ, టీఆర్‌ఎస్ అధ్యయనం

ఏపీ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2013పై టీ జేఏసీ, టీఆర్‌ఎస్ నేతలు విస్తృతంగా అధ్యయనం ప్రారంభించారు. డ్రాఫ్టు బిల్లుపై టీఆర్‌ఎస్ నేత విశ్వేశ్వర్‌డ్డి నివాసంలో సోమవారం ఆ పార్టీ, టీ జేఏసీ నేతలు కోదండరాం, కే కేశవరావు, ఈటెల రాజేందర్, సీ విఠల్, రఘు, శ్రీనివాస్‌గౌడ్, దేవీవూపసాద్, అద్దంకి దయాకర్, డీపీ రెడ్డి, విద్యా సాగర్‌రావు, మాజీ అడిషనల్ డీజీపీ గౌతంతోపాటు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లే ఇచ్చి.. ఆంక్షలు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని, శాసనసభలో డ్రాఫ్టు బిల్లుపై అభ్యంతరాలు చెప్పేందుకుగానూ పార్లమెంట్‌లో డ్రాఫ్టు బిల్లుపై సవరణకు సూచించాల్సిన అంశాలను సునిశితంగా అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు డ్రాఫ్టు బిల్లులోని 11 అంశాలను ఒక్కొక్కరు అధ్యయనం చేసేలా టీ జేఏసీ నేతలకు బాధ్యతలు అప్పగించారు.

సీమాంధ్ర ఉద్యోగులు ఏ ప్రాంతంలో ఉండాలనుకుంటే అక్కడ ఉండేలా అవకాశం ఇవ్వాలని డ్రాఫ్టులో పేర్కొన్నారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులు సహజంగా హైదరాబాద్‌లో ఉండేందుకే ఇష్టపడతారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులంతా హైదరాబాద్‌లో ఉంటామని ఆప్షన్ ఇస్తే రాబోయే తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడవు. దీంతో ఉద్యమం ఫలాలు నిరుద్యోగులకు అందే అవకాశం ఉండదని.. సోర్స్ ఆఫ్ రిక్రూట్‌మెంట్(ఉద్యోగి జిల్లా)ను ఆధారంగా చేసుకుని పంపిణీ చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఉద్యోగుల పంపిణీకి డ్రాఫ్టు బిల్లు సవరణకు చేయాల్సిన సూచనల బాధ్యతను తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత సీ విఠల్‌కు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ అంశానికి వస్తే 371(హెచ్)ను అమలు చేయాలని కేంద్రం డ్రాఫ్టు బిల్లులో పేర్కొంది.

తద్వారా తెలంగాణ గవర్నర్‌కు విశేష అధికారాలు దక్కడంతోపాటు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ సలహాదారులు శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. గవర్నర్ చర్యలు పారదర్శకంగా లేకుంటే తెలంగాణ ప్రజలు పీడనకు గురయ్యే అవకాశం ఉంటుంది. విద్యుత్ అంశంలో తెలంగాణకు బొగ్గుపై కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ అవి అమలు అవుతాయా? పకడ్బందీ అమలుకు చేయాల్సిన సూచనలను ఎలక్షికిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేత రఘుకు అప్పగించారు. నీటి పారుదల అంశాన్ని జల రంగనిపుణులు విద్యాసాగర్‌రావుకు అప్పగించారు. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం డ్రాఫ్టు బిల్లు సవరణలకు సూచించాల్సి అంశాలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.