తెలంగాణ జేఏసీ జనచైతన్య యాత్ర ప్రారంభం

హైదరాబాద్: ‘సాగదీస్తే … సాగనంపుతాం’ నినాదంతో తెలంగాణ పొలిటికల్ జేఏసీ జన చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా యాత్ర కొనసాగుతోందని, 25న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. పొలిటికల్ జేఏసీ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర ఈ రోజు రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూరులో కొనసాగుతుంది. 2014 ఎన్నికల లోపు తెలంగాణ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్, విఠల్ తెలిపారు. యాత్ర ముగిసిన అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు పేర్కొన్నారు.

 

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.