తెలంగాణ జాగృతి కన్వీనర్‌ల నియామకం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆ సంస్థ కన్వీనర్‌లను ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఆమె నియామక జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర, జిల్లా కన్వీనర్‌ల పేర్లను జాబితాలో పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్రయూత్ కన్వీనర్‌గా దాస్యం విజయ్‌భాస్కర్‌ను నియమించారు. రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్‌గా మంచాల వరలక్ష్మి, జాగృతి విద్యార్థి కన్వీనర్‌గా మానంపల్లి శ్రీకాంత్, రాష్ట్రహెల్త్ కన్వీనర్‌గా డాక్టర్ సీహెచ్‌పభావతి, రాష్ట్ర కల్చరల్ వింగ్ కన్వీనర్‌గా కొడారి శ్రీను, రాష్ట్ర బుక్ క్లబ్ కన్వీనర్‌గా నంది శ్రీనివాస్ నియమితులయ్యారు. తెలంగాణ జిల్లాలకు కూడా ఆమె కన్వీనర్‌లను నియమించారు. మంచిర్యాల-ఎల్‌పేమ్‌రావు, ఆదిలాబాద్-సాహెబ్‌రావు పవార్, కరీంనగర్-తానిపర్తి తిరుపతిరావు, వరంగల్-కొడుగోటి మొగిలయ్య, నిజామాబాద్-ముత్యాల సునీల్‌రెడ్డి, మెదక్-గుండం మోహన్‌రెడ్డి, రంగారెడ్డి(ఈస్ట్)-విజేందర్, రంగారెడ్డి నల్లగొండ-బోనగిరి దేవేందర్, మహబూబ్‌నగర్-ఎం ఖమ్మం-గుంటి సుందర్, గ్రేటర్ హైదరాబాద్-ధరణికోట వెంకటరమణ కన్వీనర్‌లుగా నియమితులైన వారిలో ఉన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.