తెలంగాణ జర్నలిస్టుల దెబ్బ.. సమైక్యవాదుల బొబ్బ

రుజువులు లేని ఉద్యమం అంటూ ఓ తప్పుడు వ్యాసాల సంకలనాన్ని పుస్తకంగా ఆవిష్కరించాలని చూసిన సమైక్యవాదులకు తెలంగాణ మంట ముట్టింది. వందమందికి పైగా పోలీసులను రక్షణగా పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ జర్నలిస్టుల దెబ్బకు సమైక్యవాదులు బొబ్బ పెట్టిన్రు. వీపు చింతపండు అయ్యేలా తన్నులు తిన్నరు. చెంపలు చెటేల్ మంటుంటే ప్రెస్ క్లబ్ బయటికి ఉరుకుడు మొదలుపెట్టిన్రు. తెలంగాణ ఉద్యమానికి రుజువులు లేవన్న పుస్తకాన్ని తగులబెట్టి.. వాళ్ల ముఖాన కొట్టి ఇదిగోరా రుజువు అని చూపించిన్రు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులపై సమైక్యవాది వాటర్ బాటిల్ విసిరిండు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు చేతలతో సమాధానం చెప్పిన్రు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అద్దాలు పగిలినయి.. టేబుళ్లు విరిగినయి. సమైక్యవాదులకు మద్దతుగా నిలిచిన ఏపీయూడబ్ల్యూజే నేత సోమసుందర్ ను జర్నలిస్టు ఫోరం నేత క్రాంతి నిలదీసిండు. సోమసుందర్ వల్ల క్రాంతి చేతికి గాయమైంది.

సమైక్యవాదులకు తెలంగాణ తడాఖా చూపిన జర్నలిస్టులందరికీ పోరుతెలంగాణ శ్రీనివాస్  ఉద్యమాభివందనాలు..

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.